News February 27, 2025

రేపే AP బడ్జెట్.. కీలక పథకాలకు కేటాయింపులు

image

AP: అసెంబ్లీలో రేపు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. ₹3L Crతో పద్దు ఉండొచ్చని అంచనా. ఉ.9గంటలకు CM CBN అధ్యక్షతన క్యాబినెట్ సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. దీన్ని శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల, మండలిలో కొల్లు రవీంద్ర, వ్యవసాయ బడ్జెట్‌ను అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలతో పాటు కీలక ప్రాజెక్టులకు కేటాయింపులు ఉండనున్నాయి.

Similar News

News January 22, 2026

మహాశివరాత్రి ఏరోజు జరుపుకోవాలి?

image

మహా శివరాత్రి ఏటా మాఘ మాసంలోని కృష్ణ పక్షం చతుర్దశి రోజున వస్తుంది. సాధారణంగా హిందూ పండుగలు ఉదయం పూట తిథి ఉన్న రోజున జరుపుకుంటారు. కానీ శివరాత్రికి మాత్రం రాత్రి సమయంలో తిథి ఉండటం ప్రధానం. ఈ ఏడాది చతుర్దశి తిథి ఫిబ్రవరి 15 (ఆదివారం) సా.4.47కి ప్రారంభమై 16న (సోమవారం) సా.5.32కి ముగియనుంది. అర్ధరాత్రి చతుర్దశి ఉన్న 15వ తేదీన మహాశివరాత్రి జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు.

News January 22, 2026

మీరు మా వల్లే బతుకుతున్నారు.. కెనడా PMపై ట్రంప్ ఫైర్

image

దావోస్ వేదికగా కెనడాపై ట్రంప్ ఫైర్ అయ్యారు. ‘US వల్లే కెనడా బతుకుతోంది. మా నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు. మీకు కృతజ్ఞత లేదు. మార్క్ ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఇది గుర్తుంచుకో’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా లాంటి పెద్ద దేశాలు తమ ఆర్థిక శక్తిని వాడుకుని ఇతర కంట్రీస్‌ను భయపెడుతున్నాయని, అందుకే మధ్యస్థ దేశాలన్నీ ఏకం కావాలని కెనడా PM మార్క్ కార్నీ అన్న వ్యాఖ్యలకు కౌంటర్‌గా ట్రంప్ సీరియస్ అయ్యారు.

News January 22, 2026

40వేల మందితో సమగ్ర భూసర్వే చేయించాం: జగన్

image

AP: 40వేల మంది సిబ్బందితో భూముల రీసర్వే సమగ్రంగా చేయించామని YS జగన్ పేర్కొన్నారు. ‘సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. హెలికాప్టర్లు, డ్రోన్లు వినియోగించాం. ఈస్థాయిలో రైతులకు, ప్రజలకు మేలు చేసిన GOVT ఏదీలేదు. ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా డిజిటల్ రికార్డులు సిద్ధం చేశాం’ అని వివరించారు. ఏదో రాయిని పెట్టేసి వదిలేయకుండా అధికారిక సరిహద్దులు చూపేలా సమగ్ర చర్యలు తీసుకున్నామన్నారు.