News October 10, 2025

AP క్యాబినెట్ నిర్ణయాలు

image

*పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటల్స్ నిర్మాణానికి ఆమోదం
*అమరావతిలో సదరన్ గ్రూప్ హోటల్ కట్టేందుకు గ్రీన్ సిగ్నల్
*అమరావతిలో రూ.400 కోట్లతో దసపల్లా 4స్టార్ హోటల్ నిర్మాణానికి ఆమోదం
*అనంతపురంలో 400 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు అంగీకారం
*రూ.1.17 లక్షల కోట్ల పెట్టుబడులను ఆమోదించిన క్యాబినెట్
*పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలకు అంగీకారం
*ఓర్వకల్లులో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టుకు ఆమోదం

Similar News

News October 10, 2025

AP క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

*రూ.212 కోట్లతో రాజ్ భవన్ నిర్మాణానికి ఆమోదం
*పంచాయతీ సెక్రటరీలను పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్‌లుగా మార్చేందుకు అనుమతి
*పంచాయతీల వర్గీకరణకు ఆమోదం
*13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మార్పు
*విశాఖలో రూ.87వేల కోట్లతో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం
*గూగుల్ డేటా సెంటర్‌కు 480 ఎకరాల భూమి కేటాయింపు

News October 10, 2025

రేపు ఉదయం లోగా వర్షాలు!

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు ఉదయం 8.30గంటల లోపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలకు ఛాన్స్ ఉందని చెప్పింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ మీ ప్రాంతంలో వాతావరణం ఎలా ఉంది?

News October 10, 2025

నోబెల్ ప్రైజ్ ప్రతిష్ఠ కోల్పోయింది: పుతిన్

image

NOBEL పీస్ ప్రైజ్‌కు వెనిజులా విపక్ష నేత మరియా ఎంపికవడం తెలిసిందే. దీనిపై రష్యా ప్రెసిడెంట్ పుతిన్ స్పందించారు. ‘ట్రంప్ అన్నివిధాలా అర్హులు. మిడిల్ ఈస్ట్‌లో యుద్ధాన్ని ఆపి శాంతిని నెలకొల్పుతున్నారు. శాంతికోసం పనిచేయని పలువురికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అది తన ప్రతిష్ఠను కోల్పోయింది’ అని వ్యాఖ్యానించారు. అటు ‘శాంతిపై నోబెల్‌వి మాటలే. ట్రంప్ చేసి చూపించారు. ప్రైజ్‌కు అర్హులు’ అని నెతన్యాహు అన్నారు.