News July 30, 2024

2న ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఆగస్టు 2న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సచివాలయంలో మొదటి బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, వాలంటీర్ వ్యవస్థ, భూఅక్రమాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Similar News

News December 5, 2025

సీఎం ఓయూ పర్యటన వాయిదా

image

TG: ప్రజాపాలన దినోత్సవాల్లో భాగంగా ఈ నెల 7న ఓయూకు వెళ్లాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో మార్పులు జరిగాయి. ఎల్లుండికి బదులుగా ఈ నెల 10న సీఎం ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం జరిగే సభలో పాల్గొంటారు.

News December 5, 2025

VIRAL: ఫ్లైట్స్ క్యాన్సిల్.. లగేజీ కోసం తిప్పలు!

image

400కు పైగా ఇండిగో విమానాలు రద్దవడంతో బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో గందరగోళం నెలకొంది. తిరిగి ఇంటికెళ్లాల్సిన ప్రయాణీకులు తమ లగేజీ ఎక్కడుందో వెతుక్కునేందుకు ఇబ్బంది పడ్డారు. వందల సంఖ్యలో బ్యాగులు ఒకేచోట ఉంచడంతో తమ వస్తువుల జాడ కోసం ప్రయాణీకుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎయిర్‌లైన్స్ యాజమాన్యంపై కొందరు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

News December 5, 2025

వినూత్న విద్యతోనే పిల్లల భవిష్యత్: సీఎం చంద్రబాబు

image

AP: పిల్లలు వినూత్న కార్యక్రమాలకు ముందుండాలని, వారి ప్రతిభను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసి లోపాలను వెంటనే సరిచేయాలని CM చంద్రబాబు ఉపాధ్యాయులు, పేరెంట్స్‌కు చెప్పారు. పార్వతీపురం మన్యం(D) భామినిలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో CM పాల్గొని మాట్లాడారు. చదువుతో పాటు ఆటలు, పాటలు కూడా అవసరమని అభిప్రాయపడ్డారు. పిల్లల బలాలు, బలహీనతలు గుర్తించి అన్ని సబ్జెక్టుల్లో బలమైన పునాది వేయాలని సూచించారు.