News January 6, 2025

ఈనెల 17న ఏపీ క్యాబినెట్ భేటీ

image

ఏపీ క్యాబినెట్ ఈనెల 17న మరోసారి సమావేశం కానుంది. ఈనెల 16 సా.4లోగా శాఖలన్నీ తమ ప్రతిపాదనలను అందించాలని సీఎస్ విజయానంద్ సూచించారు. ఈ భేటీలో పలు సంక్షేమ పథకాలు, పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈనెల 2న జరిగిన సమావేశంలో మంత్రివర్గం అమరావతిలో రూ.2,733 కోట్ల పనులతో సహా 14 కీలక అంశాలకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.

Similar News

News January 7, 2025

విద్యుత్ ఛార్జీలు తగ్గబోతున్నాయి: మంత్రి అచ్చెన్న

image

AP: విశాఖ పర్యటనలో PM మోదీ శంకుస్థాపన చేయనున్న గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌తో త్వరలో విద్యుత్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. YCP హయాంలో విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని మోదీ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికైన రైల్వేజోన్‌కు రేపు PM శంకుస్థాపన చేస్తారన్నారు. అటు హోంమంత్రి అనిత కూడా సభాస్థలి ఏర్పాట్లను పరిశీలించారు.

News January 7, 2025

గరికపాటి నరసింహారావుపై దుష్ప్రచారం.. ఖండించిన టీమ్

image

కొన్ని రోజులుగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ‘కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. పారితోషికాలు, ఆస్తుల విషయంలోనూ అసత్య ప్రచారం జరుగుతోంది. అవన్నీ నిరాధారం. సత్యదూరం. సదరు వ్యక్తులపై చట్టప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావాలు వేస్తాం’ అని పేర్కొంది.

News January 7, 2025

కార్యకర్తల ఘర్షణ.. తలలు పగిలాయి!

image

TG: నాంపల్లిలోని బీజేపీ ఆఫీసు వద్ద జరిగిన <<15087507>>ఘర్షణలో<<>> పలువురి తలలు పగిలాయి. తీవ్ర గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల అండతో కాంగ్రెస్ కార్యకర్తలు తమ ఆఫీసు ముందుకు వచ్చి తమపైనే దాడి చేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము శాంతియుతంగా ధర్నా చేపట్టినా తమపై బీజేపీ వాళ్లు దాడికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రమేశ్ బిధూరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.