News November 18, 2024
ఏపీ క్యాబినెట్ భేటీ వాయిదా

AP: ఇవాళ జరగాల్సిన రాష్ట్ర క్యాబినెట్ భేటీ ఎల్లుండికి వాయిదా పడింది. సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు నిన్న నారావారిపల్లెలో జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ సాయంత్రం వరకూ సీఎం అక్కడే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ సమావేశాన్ని వాయిదా వేశారు.
Similar News
News January 7, 2026
రేపు అంతరిక్షంలోకి నాసా వ్యోమగాములు

ఈ ఏడాది తొలి స్పేస్ వాక్ కోసం ISS బృందం సిద్ధమైంది. నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్మ్యాన్ రేపు సాయంత్రం 6.30 గంటలకు అంతరిక్ష కేంద్రం వెలుపలికి రానున్నారు. సుమారు ఆరున్నర గంటల పాటు సాగే ఈ ప్రక్రియలో వారు కొత్త సోలార్ ప్యానెల్స్ అమరికకు అవసరమైన కిట్లను ఇన్స్టాల్ చేస్తారు. అలాగే అంతరిక్షంలో సూక్ష్మజీవుల నమూనాలను సేకరించడం వంటి పనులు చేస్తారు.
News January 7, 2026
రాయలసీమ లిఫ్ట్ అంటూ అడ్డగోలుగా పనులు చేశారు: CBN

AP: అనుమతులు లేనందునే రాయలసీమ లిఫ్ట్ను NGT నిలిపేసిందని CM CBN స్పష్టం చేశారు. ‘రూ.3,528 కోట్లతో దీన్ని చేపట్టారు. రూ.2,500 కోట్లు ఖర్చుచేశారు. అడ్డగోలుగా పనిచేశారు. కాంట్రాక్టరుకే రూ.900 కోట్లిచ్చారు. ముచ్చుమర్రి నుంచి నీటి తరలింపు అవకాశమున్నా దీన్ని చేపట్టారు. NGT జరిమానా వేసింది’ అని పేర్కొన్నారు. అబద్ధం వందసార్లు చెబితే నిజమైపోదని, తనపై బురదచల్లితే వారికే నష్టం అని అన్నారు.
News January 7, 2026
ఇతిహాసాలు క్విజ్ – 120 సమాధానం

ప్రశ్న: వాలికి ఉన్న విచిత్రమైన వరం ఏమిటి?
సమాధానం: కిష్కింధాధిపతి అయిన వాలితో ఎవరైనా నేరుగా ముఖాముఖి యుద్ధానికి దిగితే, ఆ శత్రువు బలంలో సగం బలం(50%) వెంటనే వాలికి సంక్రమిస్తుంది. దీనివల్ల ఎదుటివాడు బలహీనపడగా, వాలి రెట్టింపు బలంతో శక్తివంతుడవుతాడు. ఈ వరం కారణంగానే వాలికి ఎదురుగా వెళ్తే చంపడం అసాధ్యమని భావించి రాముడు చెట్టు చాటు నుంచి బాణాన్ని ప్రయోగించి వాలిని సంహరించాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


