News March 17, 2025
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ

AP: రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో మంత్రులు భేటీ కానున్నారు. సీఆర్డీఏ ఆమోదించిన రూ.37,702 కోట్ల టెండర్ల పనులను ఈ సమావేశంలో ఆమోదించనున్నారు. అదే విధంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 4వ సమావేశంలో ఆమోదించిన అంశాలపైనా చర్చించి వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
Similar News
News March 17, 2025
పాక్‌కు మరో జలాంతర్గామిని ఇచ్చిన చైనా

తమ మిత్రదేశం పాకిస్థాన్‌కు చైనా మరో జలాంతర్గామిని అందించింది. 5 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా మొత్తం 8 హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లను ఇస్లామాబాద్‌కు బీజింగ్ ఇవ్వాల్సి ఉండగా గతంలో ఒకటి ఇచ్చేసింది. ఈ రెండూ కాక అత్యాధునిక ఫ్రిగేట్ నౌకలు నాలుగింటిని కూడా సమకూర్చింది. అరేబియా సముద్రంలో భారత్‌ను అడ్డుకునేందుకు పాక్‌ను వాడుకోవాలనేది చైనా వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే పాక్ నేవీని బలోపేతం చేస్తోంది.
News March 17, 2025
మాతా వైష్ణోదేవీ కాంప్లెక్స్ వద్ద మద్యం తాగిన నటుడు

బాలీవుడ్ స్టార్ కిడ్స్ క్లోజ్ ఫ్రెండ్, ఇన్ఫ్లుయెన్సర్ ఒర్హాన్ అవత్రమణిపై JK పోలీసులు కేసు నమోదు చేశారు. మాతా వైష్ణోదేవీ యాత్రలో ఆయన మద్యం సేవించారు. నిషేధం ఉన్నా రష్యన్ సిటిజన్ అనస్టాలియా సహా మరో ఏడుగురితో కలిసి కాట్రాలోని హోటల్లో మద్యం తాగినట్టు రియాసీ పోలీసులు గుర్తించారు. BNSS 223 కింద FIR నమోదు చేశారు. Call Me Bae, MyFitness – Orry x Khali వంటి సిరీసులు, Nadaaniyan సినిమాలో ఆయన నటించారు.
News March 17, 2025
వయసు పెరిగినా స్ట్రాంగ్‌గానే ఉంటా: విజయశాంతి

వయసు పెరిగినా తాను స్ట్రాంగ్‌గానే ఉంటానని నటి విజయశాంతి అన్నారు. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ టీజర్ రిలీజ్ ఈవెంట్లో ఆమె మాట్లాడారు. తన విషయంలో కళ్యాణ్ రామ్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ దొరుకుతుందన్నారు. తానే స్వయంగా ఫైట్ సీన్స్ చేసినట్లు పేర్కొన్నారు. అవి చూసి సెట్లో వారంతా షాక్ అయ్యారని తెలిపారు.