News November 19, 2024

రేపు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. రూ.85వేల కోట్ల పెట్టుబడులపై <<14654925>>SIPB భేటీలో<<>> తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. అమరావతి పనులకు గతంలో కేటాయించిన టెండర్లు రద్దు చేసి కొత్తవాటిని పిలవడంపై, అలాగే పోలవరం ప్రాజెక్టుపై చర్చించనుంది. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.

Similar News

News November 20, 2024

దర్శకుడిగా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్

image

బాలీవుడ్ స్టార్ షారుఖ్‌ ఖాన్ కుమారుడు ఆర్య‌న్ ఖాన్ మెగా ఫోన్ ప‌ట్టుకోనున్నారు. ఆర్య‌న్ త్వ‌ర‌లో ఓ వెబ్ సిరీస్‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. నెట్‌ఫ్లిక్స్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ‌ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ సిరీస్ తెర‌కెక్క‌నుంది. కొత్త సిరీస్‌తో ఆర్యన్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నట్టు షారుఖ్ తెలిపారు. నెట్‌ఫ్లిక్స్‌లో ముందెన్నడూ లేని విధంగా బాలీవుడ్‌ని ఆస్వాదిస్తారని పేర్కొన్నారు.

News November 20, 2024

దేవుడిలా వచ్చి.. వేల మందిని కాపాడి!

image

తేలు కాటుకు ఒకప్పుడు విరుగుడు లేకపోవడంతో ఎంతో మంది చనిపోయేవారు. ముఖ్యంగా MHలోని గ్రామీణ ప్రాంతాల్లో 1980లలో మరణాలు పెరగడంతో డా.హిమ్మత్రావ్ బావస్కర్ బాధితులను కాపాడేందుకు ముందుకొచ్చారు. ఆయన కొత్త మిషన్ ప్రారంభించి తేలు చికిత్సపై ప్రయోగాలు చేసి ఫలితం సాధించారు. దీనిని వైద్యులకూ నేర్పించడంతో ప్రజల జీవితాలు మారిపోయాయి. తేలు కాటు మరణాలు 40% నుంచి 1శాతానికి తగ్గాయి. ఆయనను 2022లో పద్మశ్రీ వరించింది.

News November 20, 2024

గెరాల్డ్ కోయెట్జీకి ఐసీసీ హెచ్చరిక

image

భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దక్షిణాఫ్రికా పేసర్ గెరాల్డ్ కోయెట్జీ క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు ఐసీసీ తేల్చింది. ఆఖరి టీ20లో తన బౌలింగ్‌లో అంపైర్ వైడ్ ఇచ్చినప్పుడు కోయెట్జీ అసహనం వ్యక్తం చేశారు. అభ్యంతరకర భాషలో అంపైర్‌ను దూషించారంటూ ఫిర్యాదు నమోదైంది. దీంతో అధికారిక హెచ్చరికతో పాటు అతడికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చినట్లు ఐసీసీ వర్గాలు పేర్కొన్నాయి. తప్పును కోయెట్జీ అంగీకరించారని తెలిపాయి.