News May 21, 2024

ఏపీ మూల ధన వ్యయం రూ.87,972 కోట్లు: కాగ్

image

APలో 2023-24కుగాను రూ.23,589 కోట్లు మూల ధన వ్యయం(ఆస్తుల కల్పన) చేసినట్లు కాగ్ ప్రైమరీ అకౌంట్స్‌లో వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ ఖర్చు రూ.87,972 కోట్లని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగుల వేతనాలకు రూ.52,010 కోట్లు, పెన్షన్లకు రూ.21,694 కోట్లు, సామాజిక రంగానికి(విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, SC, ST సంక్షేమం) రూ.1,10,375 కోట్లు, సాధారణ సేవలకు రూ.67,281 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.

Similar News

News November 14, 2025

స్థానిక ఎన్నికలపై 17న నిర్ణయం: CM రేవంత్

image

TG: ఈ నెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. క్యాబినెట్ భేటీలో మంత్రులందరితో ఈ అంశంపై చర్చిస్తామని వెల్లడించారు. కాగా జూబ్లీహిల్స్ గెలుపుతో స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సీఎం వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. ఈ నెల 17న లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ రానుంది.

News November 14, 2025

కేసీఆర్ ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది: రేవంత్

image

TG: కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రెస్‌మీట్లో మాట్లాడుతూ ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్‌ను విమర్శించడం భావ్యం కాదు. ఆయన క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చాక స్పందిస్తా. ఆయన కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీశ్ ప్రయత్నిస్తున్నారు. వారి పరిస్థితి ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్‌లో నిరూపించుకోవాలని వదిలేశారు’ అని వ్యాఖ్యానించారు.

News November 14, 2025

హరీశ్‌కు అసూయ, కేటీఆర్‌కు అహంకారం తగ్గలేదు: రేవంత్

image

TG: అధికారం పోయినా హరీశ్ రావుకు అసూయ, KTRకు అహంకారం తగ్గలేదని CM రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ‘వారిద్దరు అసూయ, అహంకారం తగ్గించుకోవాలి. అసెంబ్లీలో రక్తమంతా మొహంలోకి తెచ్చుకుని హరీశ్ చూస్తుంటాడు. ఆ చూపులకు శక్తి ఉంటే మాడి మసైపోతాం’ అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని చెప్పారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు.