News May 15, 2024
AP: జిల్లాల వారీగా పోలింగ్ శాతం (1/2)
*అల్లూరి- 70.20 *అనకాపల్లి- 83.84
*అనంతపురం- 79.25 *అన్నమయ్య- 76.23
*బాపట్ల- 84.98 *చిత్తూరు- 82.65
*డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ- 83.91 *ఈస్ట్ గోదావరి- 80.94
*ఏలూరు- 83.55 *గుంటూరు- 78.81
*కాకినాడ- 80.31 *కృష్ణా- 84.05
*కర్నూలు- 75.83 *నంద్యాల- 80.92 *ఎన్టీఆర్- 79.68 (మిగిలిన జిల్లాల వివరాలు తర్వాతి ఆర్టికల్‌లో)
Similar News
News January 11, 2025
ఎన్ని గంటలు కాదు, ఎంత క్వాలిటీ వర్క్ చేశామన్నదే ముఖ్యం: రాజీవ్ బజాజ్
ఎన్ని గంటలు పని చేశామనే దానికంటే, ఎంత వర్క్ క్వాలిటీగా చేశామన్నదే ముఖ్యమని బజాజ్ ఆటో సంస్థ MD రాజీవ్ బజాజ్ అన్నారు. వారానికి 90 గంటలు పని చేయాలన్న సుబ్రమణ్యన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కామెంట్స్ చేశారు. 90 గంటల పనే కావాలంటే అది పైస్థాయి ఉద్యోగుల నుంచే మొదలుపెట్టాలన్నారు. ఆదివారాలు కూడా పనిచేయాలంటూ లేబర్ నిబంధనలు అతిక్రమిస్తున్న సుబ్రమణ్యన్‌పై చర్యలు తీసుకోవాలని CPI(ML) MP రాజారామ్ డిమాండ్ చేశారు.
News January 11, 2025
విశాల్ అనారోగ్యానికి ఆ సినిమానే కారణమా?
కోలీవుడ్ హీరో విశాల్ అనారోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘వాడు వీడు’ మూవీ షూటింగ్ సమయంలో విశాల్ చెట్టుపై నుంచి కిందపడ్డట్లు తెలుస్తోంది. దీంతో బ్రెయిన్‌లో నరాలు దెబ్బతిని తీవ్రమైన తలనొప్పి, ఆకలి లేమితో ఆయన బాధపడుతున్నట్లు సమాచారం. ఇటీవల అది తీవ్రరూపం దాల్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కారణంగానే ఆయన ఈ స్థితికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
News January 11, 2025
Podcast: గోద్రా అల్లర్లపై మోదీ ఏమన్నారంటే?
2002 గోద్రా అల్లర్ల సమయంలో రైలు తగలబెట్టిన ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని PM మోదీ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు. ‘ఘటన గురించి తెలియగానే అక్కడికి వెళ్తానని అధికారులు చెప్పా. కానీ సింగిల్ ఇంజిన్ చాపర్ మాత్రమే ఉండటంతో వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. చాలాసేపు వాదించి ఏం జరిగినా నేనే బాధ్యుడినని చెప్పా. గోద్రాలో మృతదేహాలను చూసి చలించిపోయా. కానీ ఓ హోదాలో ఉన్నందున ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకున్నా’ అని చెప్పారు.