News February 5, 2026

AP EAPCET రిజిస్ట్రేషన్లు షురూ

image

జేఎన్‌టీయూ కాకినాడ నిర్వహించే AP EAPCET-2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. విద్యార్థులు ఏప్రిల్ 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆలస్య రుసుముతో మరికొన్ని రోజులు అవకాశం ఉంటుంది. మే 12, 13, 14, 15, 18 తేదీల్లో ఇంజినీరింగ్, మే 19, 20 తేదీల్లో అగ్రికల్చర్&ఫార్మసీ పరీక్షలు జరుగుతాయి. అలాగే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్లు కూడా మొదలయ్యాయి. ఏప్రిల్ 23న ఎగ్జామ్ నిర్వహిస్తారు.

Similar News

News February 9, 2026

హైకోర్టులో అంబటి లంచ్ మోషన్ పిటిషన్

image

AP: మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నం విచారణ జరపనుంది. కాగా గతేడాది నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ విధానంపై వైసీపీ ఆందోళన సందర్భంగా రాంబాబు దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో విచారణ కోసం రాజమండ్రి జైల్లో ఉన్న ఆయనను గుంటూరు తరలించారు.

News February 9, 2026

హోటల్‌లో ఒక్క నైట్‌కి ₹32 లక్షలు.. సాధారణంగా అయితే ₹2 లక్షలే

image

ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు ఢిల్లీలో AI Impact Summit జరగనుంది. దీనికి 100 దేశాల నుంచి 35,000 మంది అతిథులు వస్తున్నారు. వీరిలో సుందర్ పిచాయ్, ఆల్ట్‌మన్ వంటి హై-ప్రొఫైల్ వ్యక్తులూ ఉన్నారు. దీంతో దేశ రాజధానిలో హోటల్ రూమ్‌ల రేట్లు ఆకాశాన్నంటాయి. ఓ ప్రముఖ హోటల్‌లో ఒక నైట్ లగ్జరీ స్టేకి ట్యాక్సులతో కలిపి ₹32 లక్షలుగా ఉంది. దానికి నార్మల్ రోజుల్లో అన్నీ కలిపి ₹2 లక్షలే. దాదాపు 1500% పెరగడం గమనార్హం.

News February 9, 2026

అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల తయారీ: సీఎం

image

AP: రాష్ట్రంలో ఏఐ, క్వాంటం కంప్యూటర్లు, డేటా సెంటర్లతో పెను మార్పులు జరుగుతాయని సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్లతో కాన్ఫరెన్సులో మాట్లాడుతూ ‘అమరావతిలో రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారవుతాయి. మనమే వాటిని ప్రపంచానికి అందిస్తాం. ప్రపంచం గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ వైపు మళ్లుతోంది. మనమూ ఆ దిశగా అడుగులు వేయాలి. అధికారులు నెలవారీగా సమీక్షలు చేసుకోవాలి’ అని సూచించారు.