News May 26, 2024

ఈనెల 30న ఏపీ ఎడ్‌సెట్ హాల్ టికెట్లు విడుదల

image

AP: రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎడ్‌సెట్ పరీక్ష జూన్ 8న జరగనుంది. ఈనెల 30న హాల్ టికెట్లు విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జూన్ 15న ప్రిలిమినరీ కీని విడుదల చేసి, అదే నెల 18 వరకు కీపై అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఈసారి విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

Similar News

News December 10, 2025

IIM రాంచీలో నాన్ టీచింగ్ పోస్టులు

image

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ రాంచీ(IIM) 5 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, LLB, M.Phil/MA క్లినికల్ సైకాలజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://iimranchi.ac.in

News December 10, 2025

అమెజాన్ భారీ పెట్టుబడులు.. 10 లక్షల ఉద్యోగాలు

image

ఇండియాలో ఈ-కామర్స్ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని అమెజాన్ మరో 35 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2030 నాటికి 10 లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపింది. మరోవైపు ‘మేడ్ ఇన్ ఇండియా’ ఉత్పత్తుల ఈ-కామర్స్ ఎగుమతులను $80B వరకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్‌‌ను కీలకమైన మార్కెట్‌గా భావిస్తోన్న అమెజాన్.. ఇప్పటివరకు మన దేశంలో దాదాపు 40B డాలర్ల పెట్టుబడి పెట్టింది.

News December 10, 2025

మీరేం చేస్తున్నారు?: కేంద్రంపై మండిపడ్డ ఢిల్లీ HC

image

ఇండిగో విషయంలో కేంద్రం స్పందనపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘ప్రయాణికుల కోసం ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలేంటి?’ అని ప్రశ్నించింది. అటు ఇదే టైమ్ అని ఇతర సంస్థలు డొమెస్టిక్ ఛార్జీలు ₹40వేలకు పెంచడాన్ని తప్పుబట్టింది. వారిని కట్టడి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా నోటీస్ ఇవ్వడంతో సారీ చెప్పాయని ప్రభుత్వ లాయర్ బదులిచ్చారు. దీంతో మీరు సరిగా స్పందిస్తే ఈ పరిస్థితి వస్తుందా? అని నిలదీసింది.