News July 1, 2024
ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రారంభం

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి 7వ తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించవచ్చు.
✒ ఈ నెల 4 నుంచి 10 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్
✒ 8 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
✒ 13న ఆప్షన్ల మార్పునకు అవకాశం
✒ 16న సీట్ల కేటాయింపు
✒ 17 నుంచి 22 వరకు కాలేజీల్లో రిపోర్టింగ్
✒ 19 నుంచి తరగతులు ప్రారంభం
Similar News
News October 24, 2025
బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.
News October 24, 2025
రేపే నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే?

పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోస్తే.. జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి నాగ దేవత అనుగ్రహంతో తగిన జీవిత భాగస్వామి లభిస్తారని పేర్కొంటున్నారు. ☞ మరింత ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీ వెళ్లండి.
News October 24, 2025
340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<


