News June 1, 2024
టెన్షన్ పెడుతున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్

ఏపీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఓటర్లను మరింత ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. కొన్ని సర్వేలు TDPకి, మరికొన్ని YCPకి అధికారం దక్కుతుందని అంచనా వేశాయి. ఇరు పక్షాల మధ్య కొన్ని సర్వేల్లో 2శాతం ఓటింగ్ మాత్రమే తేడా ఉండటంతో అధికారం ఎవరికి దక్కుతుందనే టెన్షన్ పార్టీలు, ప్రజల్లో నెలకొంది. విజయం ఎవరిదనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాలి. రౌండ్ రౌండ్కు టెన్షన్ పెంచేలా కౌంటింగ్ ఉండొచ్చని రాజకీయ విశ్లేషకుల అంచనా.
Similar News
News November 28, 2025
తిరుపతిలో 600 ఎకరాల్లో ధార్మిక టౌన్షిప్

AP: తిరుపతిలో డెల్లా గ్రూప్ వసుదైక కుటుంబం పేరుతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ టౌన్షిప్ నిర్మించబోతోంది. 600 ఎకరాల ప్రైవేటు భూముల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుకు సహాయసహకారాలు అందించాలని డెల్లా ప్రతినిధులు మంత్రి అనగాని సత్యప్రసాద్ని కోరారు. ఈ టౌన్షిప్ రూ.3 వేల కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తామని, సీఎం చంద్రబాబుతోనూ చర్చిస్తానని మంత్రి అనగాని వారికి హామీ ఇచ్చారు.
News November 28, 2025
WPL మెగావేలం-2026: అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్లు వీళ్లే

1.దీప్తీ శర్మ(UP వారియర్స్): రూ.3.2కోట్లు, 2.అమీలియా కెర్(MI): రూ.3కోట్లు
3.శిఖా పాండే(UPW): రూ.2.4కోట్లు, 4.సోఫీ డివైన్(గుజరాత్ జెయింట్స్): రూ.2కోట్లు, 5.మెగ్ లానింగ్(UPW): రూ.1.9కోట్లు, 6.చినెల్లి హెన్రీ(DC): రూ.1.30కోట్లు, 7.శ్రీచరణి(DC): రూ.1.30కోట్లు,8. లిచ్ ఫీల్డ్(UPW): రూ.1.20కోట్లు
9. లారా వోల్వార్ట్(DC): రూ.1.10కోట్లు,10. ఆశా శోభన(UPW): రూ.1.10కోట్లు
News November 28, 2025
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లపై ప్రిలిమినరీ నోటిఫికేషన్

AP: రాష్ట్రంలో 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మదనపల్లె, మార్కాపురం, పోలవరం జిల్లాలుగా, మడకశిర, బనగానపల్లె, నక్కపల్లి, అద్దంకి, పీలేరును రెవెన్యూ డివిజన్లుగా పేర్కొంది. వీటిపై అభ్యంతరాలు ఉంటే 30 రోజుల్లో కలెక్టర్కు రాతపూర్వకంగా తెలపాలని ఆదేశాలు జారీ చేసింది.


