News June 4, 2024
ఏపీ FINAL RESULTS.. ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే?

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఫుల్ పిక్చర్ వచ్చేసింది. NDA కూటమిలోని టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135, జనసేన 21కి 21, బీజేపీ 10కి 8 చోట్ల విజయం సాధించాయి. వైసీపీ 11 సీట్లకే పరిమితమైంది. 175 సీట్లకు గాను ఎన్డీయే కూటమి 164 సీట్ల అఖండ మెజారిటీతో అధికారాన్ని కైవసం చేసుకుంది.
Similar News
News November 26, 2025
తాజా సినిమా కబుర్లు

✦ ‘వారణాసి’ మూవీలో మహేశ్ బాబు చిన్ననాటి పాత్రలో సుధీర్ బాబు కొడుకు ‘దర్శన్’?: సినీ వర్గాలు
✦ ‘రాజాసాబ్’ ఫస్ట్ సింగిల్‌పై విమర్శలు.. కథ, సందర్భం, డైరెక్టర్ విజన్‌కు తగినట్లు పాట ఉంటుంది. ప్రతీ పాట ఎలివేషన్‌లా ఉంటే బోర్ కొడుతుందన్న లిరిసిస్ట్ రామజోగయ్య
✦ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్గా ప్రియ భవాని శంకర్?
✦ ‘MAD’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంతో కార్తీ హీరోగా సినిమా?
News November 26, 2025
పెట్టుబడులకు గమ్యస్థానంగా HYD నిలవాలి: CM

అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా HYD నిలిచేలా TG రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. ‘ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి అంశాన్ని హైలైట్ చేయాలి. పెట్టుబడిదారులకు సిటీలోని అనుకూలాంశాలు, రాష్ట్ర కళా, సాంస్కృతిక, భాష, వాతావరణ అనుకూలతను వివరించాలి. ప్రముఖులకు బ్రాండింగ్‌లో చోటు కల్పించాలి’ అని సమ్మిట్ బ్రాండింగ్‌పై జరిగిన సమీక్షలో సూచించారు.
News November 26, 2025
పీస్ ప్లాన్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్స్కీతో భేటీ: ట్రంప్

రష్యా, ఉక్రెయిన్ మధ్య వీలైనంత త్వరగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. యుద్ధాన్ని ముగించేందుకు వారం రోజులుగా పీస్ ప్లాన్‌పై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. US ప్రతిపాదించిన 28 పాయింట్ల ప్లాన్‌కు ఇరు దేశాలు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాయని, కొన్నింటికి అంగీకారం రావాల్సి ఉందన్నారు. ఈ డీల్ ఫైనల్ అయ్యాకే పుతిన్, జెలెన్స్కీతో సమావేశం అవుతానని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.


