News September 12, 2024
ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: సీఎం చంద్రబాబు

AP: రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం ఇవాళ సచివాలయంలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంట నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగిందని సీఎం వారికి వివరించారు. ఏపీ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ప్రాథమికంగా రూ.6,882 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపిన విషయం తెలిసిందే.
Similar News
News November 25, 2025
జగన్నాథపురంలో శాటిలైట్ రైల్వే స్టేషన్?

విశాఖ రైల్వే స్టేషన్ మీద ట్రాఫిక్ భారం తగ్గించేందుకు రైల్వే శాఖ సబ్బవరం సమీపంలోని జగన్నాథపురం వద్ద కొత్త శాటిలైట్ స్టేషన్‌ను ప్రతిపాదించినట్లు సమాచారం. కొత్తవలస–అనకాపల్లి మధ్య 35 కిమీ బైపాస్ లైన్ ప్రాజెక్టులో భాగంగా.. 563 హెక్టార్లు విస్తీర్ణంలో రూ.2,886.74 కోట్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ స్టేషన్లో 15 ఫ్రైట్ ఎగ్జామినేషన్ లైన్లు, 5 కోచింగ్, 11 స్టాబ్లింగ్ లైన్లు ఉండనున్నట్లు సమాచారం.
News November 25, 2025
మహిళలకు నేడు వడ్డీ లేని రుణాల పంపిణీ

TG: 3.50 లక్షల స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వడ్డీ లేని రుణాలను అందించనుంది. ఇందుకోసం నిన్న సంఘాల ఖాతాల్లో రూ.304 కోట్లు జమ చేసింది. నేడు అన్ని నియోజకవర్గాల్లో ఉ.11 గంటలకు ఒకేసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని, తమ ప్రభుత్వం ఆ స్కీమ్‌ను పునరుద్ధరించామని పేర్కొన్నారు.
News November 25, 2025
నగదు విరాళాలపై కేంద్రం, ఈసీలకు సుప్రీం నోటీసులు

రాజకీయ పార్టీలకు గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే రూ.2 వేల లోపు నగదు విరాళాలకు ఐటీ మినహాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. నగదు రూపంలో విరాళాలు తీసుకుంటే ఎన్నికల గుర్తు కేటాయించబోమని, పొలిటికల్ పార్టీగా నమోదు చేయబోమని షరతులు విధించేలా ఈసీకి ఆదేశాలివ్వాలని పిటిషన్లో కోరారు. దీనిపై అభిప్రాయం చెప్పాలని కేంద్రం, ఈసీతోపాటు రాజకీయ పార్టీలకు సుప్రీం నోటీసులిచ్చింది.


