News December 30, 2024

9 కొత్త ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

image

AP: బీపీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. SIBP సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన లభిస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 2, 2025

‘పుష్ప’ను అరెస్టు చేసి రేవంత్ పాన్ ఇండియా సీఎం అయ్యారు: MP

image

TG: అల్లు అర్జున్ అరెస్టుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పుష్ప’ను అరెస్టు చేసి రేవంత్ రెడ్డి పాన్ ఇండియా సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. ఇక KCRలా తాము ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలనుకోవడం లేదని, బలమైన ప్రతిపక్షం ఉండాలనుకుంటున్నామని చెప్పారు.

News January 2, 2025

నితీశ్ వస్తే కలిసి పనిచేస్తాం: లాలూ ప్రసాద్

image

బిహార్ CM నితీశ్ తిరిగి INDIA కూట‌మిలో చేరికపై RJD Chief లాలూ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. నితీశ్ తిరిగి కూట‌మిలోకి వస్తే క‌లిసి నడుస్తామని లాలూ పేర్కొన్నారు. దీంతో నితీశ్ కూట‌మి మారుతార‌న్న ప్ర‌చారం ప్రారంభమైంది. అయితే ఈ వ్యాఖ్యల్ని JDU నేతలు కొట్టిపారేశారు. దీనిపై నితీశ్‌ను ప్రశ్నించగా ‘ఏం మాట్లాడుతున్నావ్’ అంటూ వ్యాఖ్యానించారు. తాము NDAలోనే ఉంటామ‌ని మరో నేత లల్లన్ స్ప‌ష్టం చేశారు.

News January 2, 2025

రోహిత్ పోరాడాల్సిన సమయం ఇది: పఠాన్

image

BGT చివరి టెస్టుకు రోహిత్ శర్మ దూరమవుతారని వస్తోన్న వార్తలపై క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ‘నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ఈ దశలో పోరాడాలి. అతను బయటకు రావాలని కోరుకోవట్లేదు. భారత క్రికెట్‌కు రోహిత్ ఎంతో చేశారు. ఈ పరిస్థితులను తిప్పికొట్టే సామర్థ్యం ఆయనకు ఉంది. ఇది సిరీస్‌లో కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా సిరీస్ తర్వాతే బయటకు రావాలి’ అని ఆయన సూచించారు.