News July 26, 2024
ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చాలని AP ప్రభుత్వం వినతి

APలో 3 ఎయిర్‌పోర్టుల పేర్లు మార్చాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. కర్నూలు(D) ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, రేణిగుంట ఎయిర్‌పోర్టుకు శ్రీ వేంకటేశ్వర, గన్నవరం ఎయిర్‌పోర్టుకు NTRగా నామకరణం చేయాలని ప్రభుత్వం కోరినట్లు కేంద్రమంత్రి మురళీధర్ మోహుల్ పార్లమెంట్లో వెల్లడించారు. మొత్తంగా 10 రాష్ట్రాలు 22 ఎయిర్‌పోర్టుల పేర్ల మార్పిడికి ప్రతిపాదనలు పంపాయన్నారు.
Similar News
News December 31, 2025
మున్సిపాలిటీల గ్రేడ్ పెరిగితే ఏమవుతుందో తెలుసా?

AP: EGDt జిల్లా కొవ్వూరు, WGDt జిల్లా తణుకు, శ్రీసత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీల గ్రేడ్ పెంచుతున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేడ్-1లో ఉన్న తణుకు, గ్రేడ్-2లోని కదిరి మున్సిపాలిటీలను సెలక్షన్ గ్రేడ్‌కు, గ్రేడ్-3లో ఉన్న కొవ్వూరును గ్రేడ్-1కు పెంచింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, కేటాయించే బడ్జెట్ పెరుగుతుంది. రోడ్లు, నీరు, శానిటేషన్ వసతులు మెరుగవుతాయి.
News December 31, 2025
వారికి 16సార్లు న్యూ ఇయర్

అంతరిక్షంలో ఉన్న అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లోని వ్యోమగాములు 16సార్లు న్యూ ఇయర్‌కు స్వాగతం పలుకుతారు. గంటకు 28వేల కి.మీ. వేగంతో భూమి చుట్టూ తిరిగే ISS 90 నిమిషాల్లో ఎర్త్‌ని చుట్టేస్తుంది. అంటే రోజులో 16సార్లు భూమి చుట్టూ తిరుగుతూ 45 నిమిషాలకు ఓ పగలు, మరో 45ని.లకు రాత్రిని చూస్తారు. అలా న్యూ ఇయర్‌కూ వీరు 16సార్లు వెల్కమ్ చెబుతారన్నమాట. ప్రస్తుతం ISSలో ఏడుగురు ఆస్ట్రోనాట్స్ ఉన్నారు.
News December 31, 2025
క్రికెట్.. 2025లో టాప్-5 ‘ఫస్ట్’ ఈవెంట్స్

☛ భారత మహిళల జట్టు ‘ఫస్ట్’ టైమ్ ODI WC గెలిచింది
☛ మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన ‘ఫస్ట్’ టీమ్‌గా IND మెన్స్ టీమ్ రికార్డు
☛ RCB ‘ఫస్ట్’ టైమ్ IPL టైటిల్ గెలిచింది
☛ టెస్ట్ క్రికెట్లో ‘ఫస్ట్’ టైమ్ ఒకే ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు (వెస్టిండీస్) డకౌట్ అయ్యారు. ఇందులో స్టార్క్(AUS) 15 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీశారు.
☛ సౌతాఫ్రికాకు ఫస్ట్ ‘WTC’ టైటిల్ విజయం


