News March 7, 2025

ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5.19 లక్షల కోట్లు: పయ్యావుల

image

AP: రాష్ట్ర అప్పులపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో రాతపూర్వక సమాధానమిచ్చారు. జూన్ 12, 2024 నాటికి ఏపీ ప్రభుత్వ అప్పులు రూ.5,19,192 కోట్లు, ప్రభుత్వ గ్యారంటీతో PSUల అప్పులు రూ.1,58,657 కోట్లు, GOVT గ్యారంటీ లేని PSU అప్పులు రూ.90,019 కోట్లు అని వెల్లడించారు. 2014 నుంచి సంవత్సరాల వారీగా అప్పుల వివరాల పీడీఎఫ్ కాపీ కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.

Similar News

News March 9, 2025

రాష్ట్రంలో కొత్త స్కీం.. మొదలైన సర్వే

image

APలో P-4 పేరుతో కొత్త <<15600961>>పథకాన్ని <<>>ఉగాది నుంచి ప్రభుత్వం అమలు చేయనుంది. 16 జిల్లాల్లో నిన్నటి నుంచి సర్వే మొదలైంది. మొత్తం పేదల్లో అట్టడుగున ఉండే 20% పేదలను గుర్తించేందుకు ప్రభుత్వం సర్వే చేస్తోంది. 27 ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తోంది. ఇంటి యజమాని ఆధార్, ఫోన్ నంబర్, టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, ఏసీ, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉందా? కరెంట్ బిల్లు ఎంత కడుతున్నారు? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.

News March 9, 2025

రెండు రోజులు జాగ్రత్త

image

ఏపీలో ఎండలు మండుతున్నాయి. నిన్న రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు రానున్న రెండు రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తెలంగాణలోనూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.

News March 9, 2025

కుల్‌భూషణ్ జాదవ్ కిడ్నాప్‌కు సహకరించిన వ్యక్తి హతం

image

పాకిస్థాన్ జైల్లో మగ్గుతున్న భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌ కిడ్నాప్‌కు సహకరించిన ముఫ్తీ షా మిర్‌ను గుర్తుతెలియని దుండగులు బలూచిస్థాన్‌లో కాల్చి చంపారు. 2016లో కుల్‌భూషణ్‌‌ను ఇరాన్-పాకిస్థాన్ బార్డర్‌లో పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసింది. ప్రస్తుతం ఆయన అక్కడి జైల్లో ఉన్నారు. జాదవ్‌ను కిడ్నాప్ చేసిన బృందంలో సభ్యుడు, జైష్-అల్-అదిల్ నేత ముల్లా ఒమర్ ఇరానీ సైతం 2020లో హతమవ్వడం గమనార్హం.

error: Content is protected !!