News June 14, 2024
స్కిల్ సెన్సస్పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

AP: రాష్ట్రంలో స్కిల్ <<13434576>>సెన్సన్<<>> చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. నైపుణ్య గణనకు అన్ని ప్రభుత్వ శాఖలు సహకరించాలని ఆదేశించింది. నిర్మాణ, ఉత్పత్తి, సేవా రంగాల్లో యువతకు ఉన్న నైపుణ్య వివరాలు సేకరించాలని సూచించింది. స్కిల్ డెవలప్మెంట్పై విధాన రూపకల్పనకు అవసరమైన సమాచారం సేకరించాలంది.
Similar News
News December 2, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

హైదరాబాద్ <
News December 2, 2025
దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News December 2, 2025
థియేటర్లలో రొమాన్స్.. టెలిగ్రామ్లో వీడియోలు

థియేటర్లలో జంటలు సన్నిహితంగా ఉండే వీడియోలు టెలిగ్రామ్, Xలో దర్శనమివ్వడం కేరళలో కలకలం రేపింది. అక్కడ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే థియేటర్లలో CCTV ఫుటేజీలు హ్యాక్ అయ్యాయి. సరైన సెక్యూరిటీ నెట్వర్క్ వ్యవస్థ లేకపోవడంతో ఈజీగా హ్యాక్ అయినట్లు నిపుణులు తెలిపారు. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్, బలమైన నెట్వర్క్, సరైన సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. థియేటర్లలో సన్నిహితంగా ఉండొద్దని చెబుతున్నారు.


