News February 19, 2025
హైదరాబాద్‌లో ఏపీ గ్రూప్-2 అభ్యర్థుల ఆందోళన

TG: ఏపీ గ్రూప్-2 పరీక్షల్లో రోస్టర్ లోపాలు సరిచేయాలంటూ ఆ రాష్ట్ర అభ్యర్థులు హైదరాబాద్‌లో ఆందోళనకు దిగారు. తప్పులు సరిచేసి మరోసారి పరీక్షలు నిర్వహించాలంటూ నగరంలోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో వారు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పరీక్షల్లో తప్పులపై ఓ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 9, 2026
T20IWC: మా జట్టు బలంగా ఉంది: ట్రంప్

ఇండియా, శ్రీలంక వేదికగా T20I WC జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ SMలో పోస్ట్ చేశారు. ‘ఇండియాలో WC జరుగుతుందని తెలిసింది. యూఎస్‌కు నా బెస్ట్ విషెస్. మా జట్టు చాలా బలంగా ఉంది. మీకు మా ప్రోత్సాహం ఉంటుంది’ అని తెలిపారు. గ్రూప్-ఏలో ఉన్న USA తమ రెండో మ్యాచ్ ఈ నెల 10న పాకిస్థాన్‌తో ఆడనుంది. తొలి మ్యాచులో భారత్ చేతిలో ఓడిన సంగతి తెలిసిందే.
News February 9, 2026
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News February 9, 2026
గాంధీ జయంతికి వెంకీ ‘ఆదర్శ కుటుంబం’!

వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘ఆదర్శ కుటుంబం’(AK 47) మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వేసవిలో రిలీజ్ కానుందని ప్రకటించినా అక్టోబర్ 2(గాంధీ జయంతి)కి విడుదల తేదీ మారే అవకాశాలున్నాయని సినీ వర్గాలు తెలిపాయి. అటు వెంకీ-అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కే మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుందని టాక్. ఇదే జరిగితే మూడున్నర నెలల వ్యవధిలో వెంకీ నటించిన 2 సినిమాలు విడుదల కానున్నాయి.


