News October 5, 2025
బిహార్ రాష్ట్రంలా మారిన ఏపీ: వైసీపీ

AP: కూటమి పాలనలో ఏపీ ఇప్పుడు బిహార్‌లా తయారైందని వైసీపీ విమర్శలు చేసింది. రాష్ట్రంలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కరవైందని విమర్శించింది. ఎమ్మెల్యేలు రౌడీల అవతారం ఎత్తి పారిశ్రామికవేత్తలకు హుకుం జారీ చేస్తున్నారని దుయ్యబట్టింది. వారికి వాటాలు ఇవ్వకపోతే కంపెనీలు నడవని పరిస్థితి నెలకొందని, దీంతో పెట్టుబడులకు ఏపీ సురక్షితం కాదని NRIలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని రాసుకొచ్చింది.
Similar News
News October 5, 2025
ఐదేళ్లలో కేజీ వెండి ధర రూ.3లక్షలు?

వెండి ధరలు కేవలం గడిచిన ఏడాదిలోనే 54% పెరిగాయి. పారిశ్రామిక రంగంలో, ముఖ్యంగా సోలార్ ప్యానల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలలో సిల్వర్‌కు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే అతి త్వరలోనే కేజీ వెండి ధర రూ.2లక్షలు, ఐదేళ్లలో మూడు లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇన్వెస్టర్లు బంగారం, వెండిని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నట్లు వెల్లడించారు.
News October 5, 2025
సామీ బస్సో.. ఓ యువ ‘వృద్ధుడు’

ఇటలీ ప్రధాని జార్జియా నివాళులర్పించడంతో అరుదైన జన్యు వ్యాధి ప్రొజెరియాతో పోరాడిన సామ్మీ బస్సో(28) గురించి నెట్టింట చర్చ మొదలైంది. ఈ వ్యాధి వల్ల చిన్న వయసులోనే వేగంగా వృద్ధాప్యం సంక్రమిస్తుంది. ఈక్రమంలో వ్యాధి నివారణ పరిశోధనకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు సామ్మీ మాలిక్యులర్ బయాలజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన సంకల్పం లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచింది. సామీ గతేడాది ఇదేరోజున చనిపోయారు.
News October 5, 2025
RED ALERT.. కాసేపట్లో పిడుగులతో కూడిన వర్షాలు

AP: రాబోయే మూడు గంటల్లో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరుకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.