News March 23, 2025
మే 7న ఏపీ ఐసెట్

AP: MBA, MCA కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు కన్వీనర్ ఎం.శశి తెలిపారు. ఏప్రిల్ 9 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఏప్రిల్ 14 వరకు ₹1000, 15 నుంచి 19 వరకు ₹2వేలు, 20 నుంచి 24 వరకు ₹4వేలు, 25 నుంచి 28వ తేదీ వరకు ₹10వేల లేట్ ఫీజుతో అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. మే 7న పరీక్ష నిర్వహిస్తారు.
వెబ్ సైట్: https://cets.apsche.ap.gov.in/
Similar News
News March 24, 2025
గుంటూరు CID కార్యాలయానికి పోసాని

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇవాళ గుంటూరులోని CID ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల బెయిల్ ఇచ్చిన సమయంలో సీఐడీ కేసుకు సంబంధించి వారంలో 2 రోజులు కార్యాలయానికి వెళ్లాలని కోర్టు ఆదేశించింది. సోమ, గురువారం కార్యాలయంలో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం తెలిసిందే. CIDతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కేసులు నమోదై రిమాండులో ఉండగా, ఒక్కొక్కటిగా బెయిల్ రావడంతో పోసాని 2 రోజుల కిందట రిలీజ్ అయ్యారు.
News March 24, 2025
తెరపై మెరిసిన క్రికెటర్లు వీళ్లే!

ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ‘రాబిన్హుడ్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. క్రికెటర్లు సినిమాల్లోకి రావడం కొత్తేమీ కాదు. తెరపై మెరిసిన క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అందులో బ్రెట్లీ- అన్ఇండియన్, పఠాన్ – కోబ్రా, యువరాజ్- పుట్ సరదారన్ దే, మెహందీ షగ్రా దిలలో బాలనటుడిగా, సచిన్ తన డాక్యుమెంటరీలో, కపిల్ దేవ్-83, అజయ్ జడేజా- ఖేల్, సునీల్ గవాస్కర్ – పదుల సినిమాల్లో నటించారు.
News March 24, 2025
‘గ్రూప్-1 మెయిన్స్’పై హైకోర్టులో పిటిషన్

TG: గ్రూప్-1 మెయిన్స్ రీవాల్యుయేషన్ జరిపించాలంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే దిద్దించారని తెలిపారు. 3 భాషల్లో పరీక్ష జరిగితే ఒకే నిపుణుడితో మూల్యాంకనం చేయించడం వల్ల నాణ్యత కొరవడిందని చెప్పారు. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందన్నారు. వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని TGPSCకి నోటీసులిచ్చింది.