News June 27, 2024
AP- IIITలకు ఎంతమంది అప్లై చేశారో తెలుసా?
AP- RGUKT పరిధిలోని 4 IIITల్లో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి గత నెల 8న ప్రారంభమైన ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 25వ తేదీకి ముగిసింది. ఈఏడాది 4,400 ప్రవేశాలకు గాను 53,863 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. జులై 11న ఎంపికైన అభ్యర్థుల
జాబితాను ప్రకటించనున్నట్లు తెలిపారు. జులై 22, 23న నూజివీడు, ఇడుపులపాయ,
24, 25న ఒంగోలు, 26, 27న శ్రీకాకుళం IIIT అభ్యర్థులకు కౌన్సెలింగ్ జరగనుంది.
Similar News
News October 8, 2024
సంక్రాంతిలోగా పనులు పూర్తి చేయాలి: కడప కలెక్టర్
కడప జిల్లాల్లో గ్రామ సభల్లో ఆమోదిందించిన పల్లె ప్రగతికి ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను వచ్చే సంక్రాంతి లోపు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ శివ శంకర్ ఆదేశించారు. ఉపాధి హామీ పనులు, గ్రామ సభలు, పల్లె పండుగ పంచాయతీ వారోత్సవాలు తదితర అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్లతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ నెల 14వ తేది నుంచి 20వ తేది వరకు పల్లె పండుగ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు.
News October 8, 2024
కడప: 10న ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాల్లో సేవలు
కడప డివిజన్ పరిధిలో జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా గురువారం అక్టోబర్ అంత్యోదయ దివాస్ సందర్భంగా ప్రత్యేక ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కడప డివిజన్ పోస్టల్ ఇన్‌ఛార్జ్ రాజేశ్ తెలిపారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7:00 వరకు అందుబాటులో ఉంటారన్నారు. కడపతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ సేవలు ఉంటాయన్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News October 8, 2024
మైదుకూరు: కాలువలో పడి బాలుడి మృతి
మైదుకూరు మండలం విశ్వనాథపురంలో కొట్టం సుజిత్ (14) అనే బాలుడు కాలవలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. ఎస్సీ కాలనీకి చెందిన సుజిత్ గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువలో ప్రమాదవశాత్తూ పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి మృతితో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.