News April 25, 2024
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్

AP: లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈసీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విజ్వజిత్‌ను, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణను నియమించింది. రేపు ఉదయంలోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. ఇటీవల జగన్‌పై దాడి ఘటనలో డీజీ, సీపీపై ఈసీ వేటు వేసిన సంగతి తెలిసిందే.
Similar News
News December 2, 2025
వైకుంఠ ద్వార దర్శనం.. నేడు ఈ-డిప్

AP: తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల వివరాలను నేడు TTD విడుదల చేయనుంది. వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి 24 లక్షల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తం 1.8 లక్షల టోకెన్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి ఈ-డిప్‌లో ఎంపికైన భక్తుల ఫోన్లకు ఇవాళ మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
News December 2, 2025
US, UK ఒప్పందం.. ఔషధాలపై ‘0’ టారిఫ్

అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. UK నుంచి USకు ఎగుమతి అయ్యే ఔషధాలపై సున్నా టారిఫ్‌లు అమలయ్యేలా ఇరుదేశాలు అంగీకారం తెలిపాయి. దీనికి బదులుగా ఔషధాల ఆవిష్కరణలకు అమెరికాలో యూకే 25శాతం అధిక పెట్టుబడులు పెట్టనుంది. దీంతో అక్కడ ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉండనుంది. ఏటా కనీసం 5బిలియన్ డాలర్ల విలువైన UK ఔషధాలు టారిఫ్ లేకుండా USలోకి ఎగుమతి అవుతాయి.
News December 2, 2025
నేడు భౌమ ప్రదోషం.. శివానుగ్రహం కోసం ఈరోజు సాయంత్రం ఏం చేయాలంటే?

త్రయోదశి తిథి, మంగళవారం కలిసి వచ్చిన సందర్భంగా ఈరోజును ‘భౌమ ప్రదోషం’గా పరిగణిస్తారు. ఈ శుభ దినాన సాయంత్రం శివ పార్వతులను పూజిస్తారు. ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం శివాలయానికి వెళ్లి, అభిషేకాలు నిర్వహిస్తే.. మనోభీష్టాలు నెరవేరతాయని నమ్మకం. బిల్వ, ఉమ్మెత్త పూలు, పండ్లు, పెరుగు, తేనె, శమీ ఆకులు సమర్పించి, ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని 108 సార్లు పఠిస్తే విశేష ఫలితాలుంటాయని అంటున్నారు.


