News March 18, 2024
ఉద్యాన పంటల ఉత్పత్తిలో ఏపీ నంబర్-1

AP: ఉద్యానవన పంటల ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది. 2023-24లో 1.81 లక్షల టన్నుల దిగుబడి ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(1.42 లక్షల టన్నులు), UP(1.27 లక్షల టన్నులు) ఉన్నాయని తెలిపింది. దేశంలో ఉత్పత్తి 11.20 లక్షల టన్నులు కాగా, AP వాటా 16.16 శాతమని పేర్కొంది. అరటి, నిమ్మ, బత్తాయి ఉత్పత్తిలోనూ రాష్ట్రం తొలి స్థానంలో నిలవడం విశేషం.
Similar News
News July 4, 2025
ప్రతి ఒక్కరూ జీవితంలో ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకోవాలి: కలెక్టర్

జీవితంలో ఒక ఉన్నత లక్ష్యం ఎంచుకొని దానికి అనుగుణంగా కష్టపడి సాధన చేసి అక్కడికి చేరుకోవాలని కలెక్టర్ బాలాజీ పిల్లలకు ఉద్బోధించారు. కలెక్టరేట్లో PM కేర్ పథకం కింద కోవిడ్ సమయంలో తల్లిదండ్రులను కోల్పోయి గుర్తించిన పిల్లలతో కలెక్టర్ శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి బాగోగులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News July 4, 2025
ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ ఎప్పుడంటే?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ఇతర నటీనటులతో సెప్టెంబర్లో షూటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రభాస్ నవంబర్ నుంచి షూట్లో పాల్గొంటారని మూవీ టీమ్కు చెందిన ఓ వ్యక్తి తెలిపారు. ఇందులో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో రెబల్ స్టార్ కనిపించనున్నట్లు సమాచారం. త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తున్నారు.
News July 4, 2025
మెగా DSC.. రేపు ‘కీ’లు విడుదల

AP: మెగా DSCలో జూన్ 29 నుంచి జులై 2 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’లను రేపు రిలీజ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. <