News December 11, 2024
30 మందిని కాపాడి ఏపీ జవాన్ వీరమరణం

AP: రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడుకు చెందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) 30 మంది సైనికులను కాపాడి వీరమరణం పొందారు. జమ్మూలోని ఎల్ఓసీ వెంట 30 మంది జవాన్లతో కలిసి సుబ్బయ్య పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ల్యాండ్ మైన్పై కాలు పెట్టారు. ఇది గమనించి తన తోటి సైనికులను గో బ్యాక్ అంటూ గట్టిగా అరిచారు. ఆ తర్వాత అది ఒక్కసారిగా పేలడంతో సుబ్బయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News October 3, 2025
అరుదైన రికార్డు.. వరల్డ్ క్రికెట్లో ఒకే ఒక్కడు

భారత స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన రికార్డు నెలకొల్పారు. విండీస్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసి భారత్లో వేగంగా 50 వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్(51), ఆస్ట్రేలియా(64), భారత్.. మూడు దేశాల్లో 50 వికెట్లు తీసిన ప్లేయర్గా బుమ్రా నిలిచారు. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లోని యాక్టివ్ ప్లేయర్లలో ఈ ఘనత సాధించింది అతనొక్కడే కావడం విశేషం.
News October 3, 2025
అక్టోబర్ 3: చరిత్రలో ఈరోజు

1903: స్వాతంత్ర్య సమరయోధుడు స్వామి రామానంద తీర్థ జననం(ఫొటోలో)
1954: నటుడు సత్యరాజ్ జననం
1968: రచయిత, నిర్మాత, దర్శకుడు ఎన్.శంకర్ జననం
1978: భారత్లో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ దుర్గా అగర్వాల్ జననం
1923: బ్రిటిష్ ఇండియా తొలి మహిళా పట్టభద్రురాలు, తొలి మహిళా వైద్యురాలు కాదంబినీ గంగూలీ మరణం(ఫొటోలో)
2006: సినీ నటి ఇ.వి.సరోజ మరణం
2013: తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం
News October 3, 2025
అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోంమంత్రి

AP: ఉత్తరాంధ్రకు భారీ వర్షసూచన నేపథ్యంలో ప్రభుత్వం అలర్టయింది. హోంమంత్రి అనిత కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ ఈదురుగాలులకు ఆస్కారం ఉంది. రాత్రంతా అధికారులందరూ అందుబాటులో ఉండాలి. ప్రాణ నష్టం జరగకుండా చూడాలి. రోడ్డు మీద పడే చెట్లను ఎప్పటికప్పుడు తొలగించాలి. వంశధార, నాగావళి వరదకు ఛాన్స్ ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి’ అని ఆదేశించారు.