News June 27, 2024

ఏపీ లాసెట్ ఫలితాలు విడుదల

image

AP: లాసెట్‌, పీజీ ఎల్‌ సెట్‌ పరీక్షల ఫలితాలను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్లు, ఐదేళ్ల LLB, రెండేళ్ల LLM కోర్సుల్లో ప్రవేశాల కోసం జూన్‌ 9న ఈ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రిజల్ట్స్, ర్యాంక్ కార్డు కోసం <>https://cets.apsche.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడగలరు.

Similar News

News November 27, 2025

గుంతకల్లు: రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన రాజేశ్

image

గుంతకల్లు పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న ఇంటర్ విద్యార్థి రాజేశ్ వినుకొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పరుగు పందెం పోటీలలో పాల్గొని 200, 400, 4×1000 పోటీలలో ప్రథమ స్థానం సాధించి లక్నోలో నిర్వహించే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేశ్ జాతీయ పోటీలకు ఎంపికై కళాశాలకు పేరు తెచ్చారని అభినందించారు.

News November 27, 2025

ట్రేడ్ మోసం.. ₹35 కోట్లు నష్టపోయిన పెద్దాయన

image

ట్రేడ్ ఫ్రాడ్ వల్ల ₹35 కోట్లు నష్టపోయారో వ్యాపారవేత్త. ముంబైకి చెందిన భారత్ హారక్‌చంద్ షా(72) వారసత్వంగా వచ్చిన షేర్లను 2020లో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీ డిమ్యాట్ అకౌంట్‌కు బదిలీ చేశారు. కంపెనీ ఉద్యోగులు ఆయన ఖాతాను చూసుకుంటామని చెప్పి 2020-24 మధ్య ఫ్రాడ్ చేశారు. ఈ క్రమంలో ₹35 కోట్ల అప్పు ఉందని కంపెనీ చెప్పడంతో ఆయన షాకయ్యారు. మొత్తం అప్పును చెల్లించిన షా.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News November 27, 2025

ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

image

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>