News October 9, 2025
AP న్యూస్

☛ రాష్ట్రంలో రహదారుల మరమ్మతులకు రూ.1000 కోట్లు మంజూరు.. జిల్లా రోడ్లకు రూ.600 కోట్లు, రాష్ట్ర రోడ్లకు రూ.400 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
☛ అమరావతిలో రూ.104కోట్లతో క్వాంటమ్ హబ్ భవన నిర్మాణానికి CRDA గ్రీన్ సిగ్నల్
☛ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 15 నుంచి విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మె.. 15న చలో విజయవాడ
☛ 2 రోజుల్లో రాష్ట్రంలోని బాణసంచా పరిశ్రమల్లో తనిఖీలు: హోంమంత్రి అనిత
Similar News
News October 9, 2025
దామోదర్ రెడ్డి మృతిపై రాహుల్ గాంధీ సంతాపం

సూర్యాపేట: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతి పట్ల ఏఐసీసీ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సంతాపం ప్రకటించారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఆయన లేఖ ముఖంగా దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి దామన్న చేసిన సేవలను స్మరించుకున్నారు.
News October 9, 2025
IGMCRI 226 పోస్టులకు నోటిఫికేషన్

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. వెబ్‌సైట్: https://igmcri.edu.in/
News October 9, 2025
దీపావళి ఏ రోజు జరుపుకోవాలంటే?

అక్టోబర్ 20, 21 తేదీల్లో అమావాస్య తిథి ఉండటంతో.. ఈ ఏడాది దీపావళి ఏ రోజు జరుపుకోవాలన్న గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పండితుల సంస్థ ‘కాశీ విద్వత్ పరిషత్’ దీనిపై క్లారిటీ ఇచ్చింది. దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీన జరుపుకోవాలని స్పష్టం చేసింది. పూర్తి ప్రదోషకాలం (5.46 PM-8.18 PM)ఆరోజు ఉంటుందని వెల్లడించింది. లక్ష్మీపూజ కూడా అదే రోజు రా.7.08-రా.8.18 మధ్య జరుపుకోవచ్చని తెలిపింది.