News November 15, 2024
AP NEWS రౌండప్
✒ విశాఖ జిల్లాలో ప్రేమించలేదనే కారణంతో యువతిపై నీరజ్ శర్మ అనే యువకుడు దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. తలకు 31 కుట్లు పడ్డాయి. ఘటన జరిగి 24 గంటలైనా నిందితుడు ఆచూకీ దొరకలేదు.
✒ తిరుపతి జిల్లా సత్యవేడు గురుకుల పాఠశాలలో ఒకేసారి 60 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నవారికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఓ స్టూడెంట్ పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News November 15, 2024
ప్రభుత్వ అస్థిరతకు BJP, BRS కుట్ర: మంత్రి శ్రీధర్ బాబు
TG: తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలు చేస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సింపతీ కోసమే కేటీఆర్ పదేపదే అరెస్టు అంటున్నారని, ఆయన అరెస్టుకు తాము కుట్ర చేయలేదని తెలిపారు. లగచర్లలో అధికారులపై హత్యాయత్నం జరిగిందని, రైతుల ముసుగులో కొందరు దాడికి పాల్పడ్డారని పేర్కొన్నారు. విచారణ పూర్తయ్యాక అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు.
News November 15, 2024
BGT: INDపై AUS గేమ్‌ప్లాన్
ఆసీస్‌లో అడుగుపెట్టిన IND ఒకేసారి 2 గేముల్లో తలపడాల్సి ఉంటుంది. ఒకటి క్రికెట్. రెండోది మైండ్‌గేమ్. కొన్నేళ్లుగా అక్కడిదే ఒరవడి. ముందు అక్కడి మీడియా భారత జట్టులో విభేదాలున్నట్టు నెరేటివ్ సృష్టిస్తుంది. ఆ తర్వాత పాంటింగ్ సహా ఇతర మాజీలు భారత క్రికెటర్ల ఫామ్ బాలేదని, ఓడిపోతారని చెప్పేస్తారు. కోహ్లీతో పెట్టుకోవద్దని అప్పట్లో మానేశారు. IND ఫామ్ లేమి, NZ చేతిలో క్లీన్‌స్వీప్ అవ్వడంతో మళ్లీ మొదలెట్టారు.
News November 15, 2024
SALUTE: చేయి చేయి కలిపి.. ఊరి దారిని బాగుచేసి..
AP: అనారోగ్యమొస్తే వేగంగా ఆస్పత్రికి వెళ్లే దారే ఆ ఊరికి లేదు. తమ గ్రామానికి రోడ్డు నిర్మించాలని అధికారులు, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు వేడుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో గ్రామస్థులంతా ఏకమై పలుగు, పార చేతపట్టి శ్రమదానంతో 5KM మేర మార్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ ఘటన అల్లూరి(D) పెదబయలు(M) పెదకొండాలో జరిగింది. ఇప్పటికైనా పక్కారోడ్డును నిర్మించాలని కోరుతున్నారు. వారి స్ఫూర్తికి సెల్యూట్ చేయాల్సిందే.