News August 5, 2025

AP న్యూస్ రౌండప్

image

*ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవానికి CM చంద్రబాబు, లోకేశ్‌కు ఆహ్వానం
*అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్-2025 పోర్టల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
*హ్యాండ్లూమ్ వస్త్రాలపై GST భరిస్తాం: CBN
*వైనాట్ 175లాంటిదే.. జగన్ 2.0 కూడా: నిమ్మల
*మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై ACB కోర్టు తీర్పు రిజర్వ్
*2020లో గుడివాడ ఏరియా ఆస్పత్రి అవకతవకలపై 11మంది వైద్యులు, నర్సులపై విచారణకు మంత్రి సత్యకుమార్ ఆదేశం

Similar News

News August 6, 2025

సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం: అనిల్

image

కొందరు నిర్మాతలు సినీ కార్మికుల్లో చీలిక తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని వ్యాఖ్యానించారు. తాము నిర్మాతలను ఇబ్బంది పెట్టడం లేదన్నారు. తమకు స్కిల్ లేదనడం సరికాదని, ఇక్కడ ఉన్నవాళ్లకు పని కల్పించి తర్వాత పక్క రాష్ట్రం వాళ్లను తెచ్చుకోవాలని సూచించారు. తమ సమస్యలను వివరించేందుకు ఇవాళ ఫెడరేషన్ సభ్యులు మెగాస్టార్ చిరంజీవిని కలిసే అవకాశముంది. నిన్న నిర్మాతలు ఆయనను కలిశారు.

News August 6, 2025

బీజేపీలో చేరే వారికి ఆహ్వానం: రామ్‌చందర్

image

TG: బీజేపీలో చేరే నేతలకు ఆహ్వానం పలుకుతామని పార్టీ రాష్ట్ర చీఫ్ రామ్‌చందర్ రావు అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తమ పార్టీవైపే చూస్తున్నారని చెప్పారు. ఆసిఫాబాద్‌లో పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాము ఎవరినీ ప్రలోభాలకు గురిచేయట్లేదని తెలిపారు. నేతలకు ఆ రెండు పార్టీలపై నమ్మకం లేదన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు.

News August 6, 2025

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ అందుకే స్పందించట్లేదు: రాహుల్

image

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే <<17312842>>బెదిరింపులకు<<>> పాల్పడుతున్నా ప్రధాని మోదీ అడ్డుకోకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ Xలో విమర్శలకు దిగారు. అదానీ వ్యవహారంలో యూఎస్ దర్యాప్తు చేపట్టడమే మోదీ వైఖరికి కారణమన్నారు. రష్యాతో ఆయిల్ డీల్స్‌లో మోదీ, అదానీ-అంబానీ ఆర్థిక వ్యవహారాలను బయటపెట్టే ప్రమాదం ఉందనన్నారు. మోదీ చేతులు కట్టేశారని విషయాన్ని భారత్ అర్థం చేసుకోవాలని రాసుకొచ్చారు.