News October 15, 2025
AP న్యూస్ అప్డేట్స్

* తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 30న పుష్పయాగం. 29న అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవ, 30న ఆర్జిత సేవలు రద్దు.
* రోగులు, క్షతగాత్రులకు అత్యవసర సేవలందించేందుకు కొత్తగా 190 ‘108’ వాహనాలను అందుబాటులోకి తేనున్న రాష్ట్ర ప్రభుత్వం
* విజయనగరం జిల్లాలో JSW సంస్థ రూ.531.36 కోట్లతో 1166 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న మెగా ఇండస్ట్రియల్ పార్క్‌కు ప్రభుత్వం అనుమతి
Similar News
News October 15, 2025
వంటింటి చిట్కాలు

* టమాటా, పండు మిరపకాయ పచ్చళ్లు ఎర్రగా ఉండాలంటే తాలింపులో వంటసోడా కలిపితే సరిపోతుంది.
* కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
* ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, పావు చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
News October 15, 2025
అన్ని ప్రాంతాల అభివృద్ధే మా లక్ష్యం: లోకేశ్

AP: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి లోకేశ్ అన్నారు. ‘ఉత్తరాంధ్రలో TCS, కాగ్నిజెంట్, యాక్సెంచర్, తిరుపతి శ్రీసిటీలో డైకెన్, బ్లూస్టార్, LG సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. గోదావరి జిల్లాల్లో ఆక్వాను ప్రోత్సహిస్తున్నాం. చిత్తూరు, కడపలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నాం’ అని వెల్లడించారు.
News October 15, 2025
ఈశాన్య రుతుపవనాలు.. దేశంలోకి రేపే ఎంట్రీ!

ఈశాన్య రుతుపవనాలు గురువారం(oct-16) దేశంలోకి ప్రవేశించనున్నట్లు IMD పేర్కొంది. తర్వాత 1,2 రోజులకు APలో విస్తరించే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల వల్ల ఈ నెల నుంచి డిసెంబర్ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అటు బంగాళాఖాతంలో ఈ నెల 22, 23 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.