News October 30, 2025
AP న్యూస్ అప్‌డేట్స్

✦ నవంబర్ 1న లండన్‌కు CM చంద్రబాబు.. విశాఖలో 14, 15 తేదీల్లో జరిగే CII సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్న CM
✦ ఏటా NOV 10న రాష్ట్ర పండుగగా సీపీ బ్రౌన్ జయంతి
✦ YCP రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు జగన్ వీడియో కాన్ఫరెన్స్.. మొంథా తుఫాన్ ప్రభావంపై చర్చ
✦ రాజధాని రైతులకు రాబోయే 4 నెలల్లో పెండింగ్ ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్లు పూర్తి: మంత్రి నారాయణ
Similar News
News October 30, 2025
ఏడాది తర్వాత పిల్లలకు ఏం పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ చాలామంది పేరెంట్స్ ఏడాది దాటాక కూడా పిల్లలకు పెరుగన్నం, నెయ్యి, ఉప్పు కలిపి అన్నం పెడుతుంటారు. బాల్యంలో పిల్లలకు సరైన పోషకాలు అందిస్తేనే పెద్దయ్యాక కూడా ఆరోగ్యంగా ఉంటారంటున్నారు నిపుణులు. వారికి ఏడాది దాటాక నెమ్మదిగా అన్నిరకాల ఆహారాలు అలవాటు చెయ్యాలి. కిచిడీ, పొంగల్, పాలకూర పప్పు, వెజిటబుల్ రైస్ వంటివి తినిపించాలంటున్నారు.
News October 30, 2025
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
News October 30, 2025
US కీలక నిర్ణయం.. ఇండియన్స్‌కు భారీ నష్టం!

ఎంప్లాయిమెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తూ US నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యూవల్‌కు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నా 540 రోజులు వర్క్ చేసే వీలుండేది. ఇప్పుడు గడువు ముగిసేలోగా రెన్యూవల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ కోల్పోతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్పౌజెస్(H4), H1Bs వీసా, STEM వర్క్ ఎక్స్‌టెన్షన్స్‌పై ఉన్న విద్యార్థులు, ఇండియన్ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది.


