News September 6, 2025
గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ దామోదర్ నాయుడు తెలిపారు. గొర్రెలు, కోళ్ల ఉత్పత్తిలో 2వ స్థానం, మాంస ఉత్పత్తిలో 4, పాల ఉత్పత్తిలో 5, గేదెల ఉత్పత్తిలో 6వ స్థానంలో నిలిచిందన్నారు. పశుదాణా, పశుగ్రాస విత్తనాలు, గోకులాల నిర్మాణాలకు సబ్సిడీలో ఇస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 25 లక్షల కుటుంబాలు పశుసంవర్ధక రంగంతో ఉపాధి పొందుతున్నాయని వివరించారు.
Similar News
News September 6, 2025
ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నా: మోదీ

మోదీ తనకు మిత్రుడని, భారత్‌తో అమెరికాకు <<17626556>>ప్రత్యేక అనుబంధం<<>> ఉందని ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోదీ స్పందించారు. ‘ఇరు దేశాల బంధాలు, సెంటిమెంట్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అభినందిస్తున్నా. ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు భారత్, అమెరికా చాలా సానుకూల దృక్పథంతో ఉన్నాయి’ అని మోదీ ట్వీట్ చేశారు.
News September 6, 2025
తురకపాలెం ప్రజలు వంట చేసుకోవద్దు: సీఎం

AP: గుంటూరు <<17604174>>తురకపాలెం<<>>లో వరుస మరణాల నేపథ్యంలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. గ్రామస్థులెవరూ వంట చేసుకోవద్దని, అక్కడి తాగు నీటిని వినియోగించొద్దని సూచించారు. అక్కడి ప్రజలకు అధికారులే ఆహారం సరఫరా చేయాలని ఆదేశించారు. దీంతో ఇవాళ్టి నుంచే తురకపాలెం గ్రామస్థులకు మూడు పూటలా ఆహారం, మంచినీళ్లు సరఫరా చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు వైద్యులు మరణాలకు గల కారణాలు కనుగొనే పనిలో పడ్డారు.
News September 6, 2025
BREAKING: మోదీ అమెరికా పర్యటన రద్దు

న్యూయార్క్(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైలెవెల్ డిబేట్‌కు PM మోదీ హాజరుకావడం లేదు. ఇటీవల విడుదల చేసిన వివిధ దేశాధినేతల స్పీచ్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న మోదీ UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంది. కానీ తాజాగా షెడ్యూల్ రివైజ్ అయింది. PM స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న స్పీచ్ ఇవ్వనున్నారు. పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.