News June 30, 2024

TG నుంచి ఏపీకి ₹5వేల కోట్లు రావాల్సి ఉంది: మంత్రి నారాయణ

image

రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా ఉమ్మడి ఆస్తుల విభజన ఇంకా పూర్తికాలేదని మంత్రి నారాయణ అన్నారు. AP హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం TG నుంచి APకి సుమారు ₹5,170cr రావాల్సి ఉందని తెలిపారు. కోర్టుల్లో ఉన్న ఉమ్మడి ఆస్తులకు సంబంధించిన కేసులు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. AP, TG జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంపిణీ చేసుకోవాలని రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉందన్నారు.

Similar News

News November 10, 2024

బంగ్లాలో నరమేధం: యూనస్‌పై ICCలో ఫిర్యాదు

image

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్‌పై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు (ICC)లో అవామీ లీగ్ ఫిర్యాదు చేసింది. ఆయనతో పాటు క్యాబినెట్ మెంబర్స్, ADA స్టూడెంట్ లీడర్లు సహా 62 మంది పేర్లను చేర్చింది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక తమ పార్టీ వర్కర్స్, హిందువులు సహా మైనార్టీలపై నరమేధం జరిగిందని పేర్కొంది. సాక్ష్యాలుగా 800 పేజీల డాక్యుమెంట్‌ను సబ్మిట్ చేసింది. మరో 15000 ఫిర్యాదులకు సిద్ధమవుతోంది.

News November 10, 2024

ఆస్ట్రేలియా చెత్త రికార్డు

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్‌లో ఆస్ట్రేలియా చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లో ఆసీస్ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయారు. 53 ఏళ్ల వన్డే చరిత్రలో ఆస్ట్రేలియా ప్లేయర్లు ఇలాంటి పేలవ ప్రదర్శన చేయడం ఇదే తొలిసారి. ఆసీస్ బ్యాటర్లు ఘోరంగా విఫలమవ్వడంతో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.

News November 10, 2024

కెనడాలో టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ!

image

కెనడాలో ఓ టీనేజర్‌కు బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. రోగితో కాంటాక్ట్‌లో ఉన్న వారి గురించి అధికారులు ఆరా తీస్తున్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. కాగా ఈ బర్డ్ ఫ్లూ పౌల్ట్రీ, డైరీ ఫామ్ ఇండస్ట్రీపై ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల USలో పలువురు కార్మికులకు సోకింది. అయితే ఈ ఫ్లూ ఒకరి నుంచి ఇంకొకరికి వస్తుందనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.