News April 1, 2025
ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్

AP: రాష్ట్రంలోని వర్సిటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 1 తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దాదాపు 153 పీజీ కోర్సులకు సంబంధించి జూన్ 6 నుంచి 8 వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://cets.apsche.ap.gov.inలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
Similar News
News December 22, 2025
ప్రజల్లోకి KCR.. దళపతి ముందు 2 సవాళ్లు

AP నీళ్ల దోపిడీ ఆపలేని ప్రభుత్వాన్ని కడిగేందుకు తానే స్వయంగా ప్రజల్లోకి వస్తానని KCR స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ముందు 2 సవాళ్లున్నాయి. మొదటిది కూతురు కవిత.. తనపై తప్ప KTR సహా BRS ముఖ్య నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఆమెపై, ప్రత్యర్థుల ప్రశ్నలపై ఏమంటారు? అటు ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రావడం లేదని CM రేవంత్ విమర్శిస్తున్నారు. బయటకు వస్తున్న మాజీ సీఎం సభలోకీ వస్తారా? అనేది ఛాలెంజ్2.
News December 22, 2025
దామోదర్ వ్యాలీ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<
News December 22, 2025
వరి నారుమడిలో ఇలా చేస్తే రైతుకు లాభం

ప్రస్తుతం చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల వరి నారుమడిలో నారు ఎర్రగా మారడం, నాటు వేసే సమయం వచ్చినా ఎదుగుదల సరిగా లేకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. దీన్ని నివారించాలంటే రోజూ ఉదయమే పొడుగు కర్రను తీసుకొని నారు కొన భాగాలకు తగిలిస్తూ, కొనలపై చేరిన మంచు బిందువులు రాలేలా చేయాలి. దీని వల్ల నారు ఎర్రగా కాకుండా, పెరుగుదల బాగుండటమే కాకుండా కొనల్లో చేరిన పురుగులు కూడా కిందపడి చీడపీడల ఉద్ధృతి తగ్గుతుంది.


