News March 24, 2024

ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్ విడుదల

image

AP: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీఈసెట్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఏప్రిల్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 29, 30 తేదీల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. పూర్తి వివరాల కోసం <>https://cets.apsche.ap.gov.in/<<>> వెబ్‌సైట్‌లో చూడాలని కోరారు.

Similar News

News November 2, 2024

నీలి రంగు అరటి పండ్లు.. ఐస్‌క్రీమ్ తిన్నట్లే రుచి!

image

పసుపు, ఆకుపచ్చగా ఉండే అరటి పండ్లనే చూస్తుంటాం. కానీ నీలి రంగులోనూ అరటి పండ్లుంటాయనే విషయం చాలా మందికి తెలియదు. దీనిని బ్లూజావా అని పిలుస్తుంటారు. ఇది వెనీలా ఐస్ క్రీమ్ టేస్టును కలిగి ఉంటుంది. ఇవి అగ్నేయాసియాలో పెరుగుతుందని, హవాయిలో బాగా ప్రాచుర్యం పొందిందని, ‘ఐస్ క్రీమ్ బనానా’ అని పేరు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ అరటి పండును మీరెప్పుడైనా టేస్ట్ చేశారా?

News November 2, 2024

రేవంత్ నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బందులు: KTR

image

TG: పరిపాలనా అనుభవం లేకుండా సీఎం రేవంత్ తీసుకుంటున్న నిర్ణయాలతో పేద, మధ్యతరగతి ప్రజలే ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. HMDA పరిధిలోని గ్రామ పంచాయతీ లేఅవుట్లలోని వెంచర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం మూర్ఖత్వమేనని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్లు చెల్లుబాటు కావంటే పేద ప్రజల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు. LRS ఫ్రీగా చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ఆయన గుర్తుచేశారు.

News November 2, 2024

ఓఆర్ఆర్‌పై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు

image

TG: రోడ్డు ప్రమాదాల నివారణకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ORRపై కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ, ఎగ్జిట్‌ల వద్ద ఈ టెస్టులు చేస్తారు. ఇప్పటికే యాక్సిడెంట్ అనాలసిస్ ప్రివెన్షన్ టీమ్‌లు కూడా ఏర్పాటు చేశారు. కాగా మద్యం తాగి ORRపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు గురవుతుండటంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.