News February 21, 2025
జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఏపీ పోలీసులు

AP: జాతీయ స్థాయిలో సత్తా చాటిన రాష్ట్ర పోలీసులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఇంతే అంకితభావంతో ప్రజలకు సేవ చేయడంలో నిరంతర విజయం సాధించాలని ఆకాంక్షించారు. రాంచీలో జరిగిన 68వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్లో డీఐజీ అంబురాజన్ నేతృత్వంలోని రాష్ట్ర పోలీస్ బృందం వివిధ కేటగిరీల్లో రాణించి రెండో స్థానంలో నిలిచింది. 4 గోల్డ్, ఒక సిల్వర్, 2 బ్రాంజ్ మెడల్స్ సాధించింది.
Similar News
News November 11, 2025
ఆయిల్ స్కిన్ ఉందా? ఇలా చేయండి

ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్లు ముస్తాబైన కాసేపటికే.. వెంటనే ముఖమంతా జిడ్డుగా మారిపోతుంది. ఇలాకాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి. * ముల్తానీమట్టి, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని చర్మానికి అప్లై చేసి 15నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే జిడ్డు తగ్గుతుంది. * రోజులో కనీసం రెండుసార్లు ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే జిడ్డుదనం తగ్గుతుంది.
News November 11, 2025
రూ.6.65 లక్షల కోట్లకు ఇళ్ల అమ్మకాలు: అనరాక్

దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు తగ్గినా వాల్యూ పరంగా మాత్రం సగటు అమ్మకం విలువ 7% పెరిగిందని రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ తెలిపింది. ప్రస్తుత FYలో తొలి ఆరు నెలల్లో రూ.2.98 లక్షల కోట్ల విలువైన 1.93 లక్షల ఇళ్లు అమ్ముడైనట్లు తెలిపింది. ఇదే జోరులో మార్చి ముగిసే సమయానికి అమ్మకాల విలువ రూ.6.65 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. HYDలో ఇళ్ల మార్కెట్ జోరుగా ఉందని బిల్డర్లు చెబుతున్నారు.
News November 11, 2025
ఇతరులు మనల్ని బాధ పెట్టకూడదంటే?

త్రివిధ తాపాల్లో రెండవది ఆది భౌతిక తాపం. ఇవి మన చుట్టూ ఉన్న ఇతర జీవుల వలన కలుగుతుంది. శత్రువులు, దొంగలు, జంతువులు, కీటకాల నుంచి మనకు కలిగే బాధలు ఈ కోవకు చెందుతాయి. వీటి నుంచి విముక్తి పొందే మార్గాలను వేదాలు చెబుతున్నాయి. ప్రేమ, కరుణ, జీవుల పట్ల సమభావం ఉండాలి. అహింసా సిద్ధాంతాన్ని ఆచరించడం, పరుల పట్ల శత్రుత్వాన్ని విడిచిపెట్టడం, అందరితో సామరస్యంగా జీవించడం ద్వారా ఈ బాహ్య దుఃఖాలను తగ్గించుకోవచ్చు.


