News April 6, 2025
వృద్ధి రేటులో రెండో స్థానంలో ఏపీ: CBN

AP: 2024-25 ఆర్థిక సంవత్సరానికిగానూ దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు(8.21%) సాధించిన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచిందని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే తమ విధానాలతో రాష్ట్రాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చామన్నారు. వ్యవసాయ పునరుజ్జీవం, తయారీ రంగం, పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సమష్ఠి కృషితోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కాగా 9.69% వృద్ధి రేటుతో TN తొలి స్థానంలో ఉంది.
Similar News
News April 7, 2025
ట్రంప్ టారిఫ్లపై ఆందోళన వద్దు: అచ్చెన్న

AP: ఆక్వా రంగంపై ట్రంప్ టారిఫ్లు తాత్కాలికమేనని, ఎవరూ ఆందోళన చెందొద్దని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అమరావతిలో ఆక్వా రంగంపై రైతులు, నిపుణులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ఆక్వా రంగాన్ని అమెరికా సుంకాలు ఇబ్బంది పెట్టవు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాలి. రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని తిరిగి గాడిలో పెడతాం’ అని ఆయన భరోసా ఇచ్చారు.
News April 7, 2025
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఎక్సైజ్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం పెంచింది. దీంతో లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 చొప్పున ధరలు పెరిగాయి. పెరిగిన ధరలు ఇవాళ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. కాగా హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.46, డీజిల్ ధర రూ.95.70గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.109.63, డీజిల్ ధర రూ.97.47గా కొనసాగుతోంది
News April 7, 2025
అల్పపీడనం.. 3 రోజులు విస్తారంగా వర్షాలు

AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు IMD వెల్లడించింది. ఇది రేపటి వరకు వాయవ్య దిశగా కదిలి ఆ తర్వాత 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో 3 రోజులు మోస్తరు వానలు కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. ఉత్తరాంధ్ర, ఉ.గో, కృష్ణా జిల్లాలపై ప్రభావం ఉండొచ్చంది. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరిగి నాలుగు రోజుల తర్వాత తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.