News December 16, 2025

AP-RCET ఫలితాలు విడుదల

image

పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే AP-RCET(రీసెర్చ్ కామన్స్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ ఆధ్వర్యంలో గత నెల నవంబరులో పరీక్షలు జరిగాయి. మొత్తం 65 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించగా, 5,164 మంది ఎగ్జామ్స్ రాశారు. వారిలో 2,859 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ఏపీ ఆర్‌సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.ఉష తెలిపారు. ఇక్కడ <>క్లిక్<<>> చేసి ఫలితాలు తెలుసుకోవచ్చు.

Similar News

News March 3, 2026

రైల్ వీల్ ఫ్యాక్టరీలో 192 పోస్టులు

image

బెంగళూరులోని <>రైల్ వీల్ ఫ్యాక్టరీ<<>> 192 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్(NTC), నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికెట్(NCVT) కలిగిన వారు ఏప్రిల్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 15ఏళ్లు పూర్తై, 24ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in

News March 3, 2026

హైదరాబాద్ to అమరావతి.. గంటన్నరలోపే!

image

TG: HYD ఫ్యూచర్ సిటీ నుంచి AP అమరావతి మధ్య ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా అత్యాధునిక సెమీ బుల్లెట్ ట్రైన్ రానుంది. TG ప్రభుత్వ ప్రతిపాదనతో మిర్యాలగూడ మీదుగా ఈ అలైన్‌మెంట్ సాగనుంది. గంటకు 250km వేగంతో దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్‌లో గంటన్నరలోపే HYD నుంచి అమరావతికి చేరుకోవచ్చు. ఈ కారిడార్‌ను చెన్నై వరకు పొడిగిస్తే 3 గంటల్లోనే వెళ్లొచ్చు. త్వరలోనే రైల్వేశాఖ DPR సిద్ధం చేయనుంది.

News March 3, 2026

వీధి కుక్కలతోనూ బ్రాండ్ మార్కెటింగ్!

image

యాడ్స్ కోసం సంస్థలు హోర్డింగ్‌లు, కటౌట్‌లపై ఖర్చు చేసే బదులు సింపుల్‌గా వీధి కుక్కలను వాడుకుంటే ఎలా ఉంటుంది? ఆదిత్య అనే ఓ మాజీ మైక్రోసాఫ్ట్ టెకీకి వచ్చిన ఐడియా ఇది. ‘Stray as a Service’ అనే పేరుతో ఏఐ ఫొటోస్ కూడా షేర్ చేశారు. దేశంలో దాదాపు 3 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయని వీటిని యాడ్స్‌కు వాడుకుంటే ఖర్చు తగ్గి, అవి తిరిగేచోటల్లా బ్రాండ్ ప్రమోట్ అవుతుందన్నారు. మరి ఈ ఐడియా ఎలా ఉంది? కామెంట్ చేయండి.