News November 14, 2024
సీనరేజ్ మినహాయిస్తూ AP సర్కార్ నిర్ణయం
AP: అమరావతి చుట్టూ ORR, విజయవాడ ఈస్ట్ బైపాస్లకు చిన్నతరహా ఖనిజాలకు సీనరేజ్ మినహాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.6వేల కోట్లకు పైగా ఖర్చయ్యే 189కి.మీ ORR, 50కి.మీ. బైపాస్ కోసం భూసేకరణను NHAI, MORTH భరించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్నికోరింది. దానికి ప్రత్యామ్నాయంగా పై నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ఈ 2నిర్మాణాల కోసం స్టీల్, సిమెంట్, తదితరాలకు రాష్ట్ర GST మినహాయింపునకు ముందుకొచ్చింది.
Similar News
News November 14, 2024
ఎడమ కంటికి సమస్య.. కుడి కంటికి ఆపరేషన్ చేశారు
UP గ్రేటర్ నోయిడాకు చెందిన నితిన్ భాటి తన కొడుకుకు ఎడమ కంట్లో నుంచి తరచూ నీరు కారుతోందని ఆనంద్ స్పెక్ట్రమ్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు. పరీక్షించిన వైద్యులు బాలుడి కంట్లో ఫారెన్ బాడీ(మెటల్ వంటి ధూళి) ఉన్నట్లు గుర్తించి, ఆపరేషన్ చేశారు. అయినా సమస్య తీరకపోవడంతో మరో ఆసుపత్రిని సంప్రదించారు. అయితే బాలుడి ఎడమ కంటికి కాకుండా కుడి కంటికి ఆపరేషన్ చేశారని తేలింది. ఘటనపై బాలుడి తండ్రి PSలో ఫిర్యాదు చేశారు.
News November 14, 2024
విలియమ్సన్ రికార్డును సమం చేసిన సూర్య
టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అరుదైన ఘనత సాధించారు. టీ20ల్లో 200కుపైగా రన్స్ ఎక్కువ సార్లు కొట్టిన జట్టుకు నాయకత్వం వహించిన రెండో కెప్టెన్గా సూర్య (9) రికార్డు సృష్టించారు. ఈ క్రమంలో ఆయన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) రికార్డును సమం చేశారు. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ (12) ఉన్నారు. మూడో స్థానంలో విండీస్ కెప్టెన్ రోవ్మన్ పావెల్ (7) కొనసాగుతున్నారు.
News November 14, 2024
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు మహిళలకు ఆహ్వానం
TG: కాంగ్రెస్ పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఘనంగా విజయోత్సవాలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. డిసెంబర్ 7న ట్యాంక్బండ్ పరిసరాల్లో, 8న సచివాలయ పరిసరాల్లో, 9న నెక్లెస్ రోడ్డులో వేడుకలు నిర్వహించనున్నారు. 9న సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని సీఎం నిర్ణయించారు.