News January 23, 2026

AP SETకు అప్లై చేశారా?

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET-2025)కు అప్లై చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు పోటీ పడేందుకు సెట్ అర్హత తప్పనిసరి. పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.apset.net.in

Similar News

News March 11, 2026

‘హార్ముజ్’ దాటాలంటే పర్మిషన్ తీసుకోవాల్సిందే: ఇరాన్

image

ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోకపోవడంతోనే ఇండియాకు వెళ్తున్న థాయిలాండ్ <<19355576>>కార్గో షిప్‌పై దాడి<<>> చేశామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటించారు. ‘హార్ముజ్ గుండా ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా వెళ్లనివ్వం. ఈ జలసంధి నుంచి వెళ్లాలంటే కచ్చితంగా పర్మిషన్ తీసుకోవాల్సిందే’ అని స్పష్టం చేశారు. ముడి చమురు బ్యారెల్‌ రేట్ 200 డాలర్లకు చేరుకుంటుందని, ప్రపంచం సిద్ధంగా ఉండాలని ఇరాన్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది.

News March 11, 2026

గ్యాస్ బుకింగ్ సిస్టమ్ క్రాష్!

image

సాధారణం కంటే 8-10 రెట్లు ఎక్కువగా ఫోన్ కాల్స్‌ రావడంతో ఇండేన్ గ్యాస్ బుకింగ్ సిస్టమ్ కుప్పకూలినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దేశంలో ఇండేన్‌కు 15 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. చాలామంది వినియోగదారులు IVRS మిస్డ్ కాల్ ద్వారానే గ్యాస్ బుకింగ్ చేస్తుంటారు. దేశంలో LPG కొరత ఏర్పడిందని తెలిసి బుకింగ్‌కు పోటెత్తడంతో ఇండేన్ బుకింగ్ సిస్టమ్ క్రాష్ అయింది. మరి మీకు ఇండేన్ గ్యాస్ బుక్ అవుతోందా? COMMENT

News March 11, 2026

ఎక్కడా గ్యాస్ కొరత లేదు: చంద్రబాబు

image

AP: స్కూళ్లు, ఆస్పత్రులకు అంతరాయం లేకుండా గ్యాస్ సరఫరా జరగాలని CM చంద్రబాబు సూచించారు. ‘ప్రస్తుతం కొరత లేదు. కేంద్రంతో మాట్లాడి ఇబ్బందులు రాకుండా చూడాలి. గుడ్లు, అరటి లాంటి ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతకాలి. సిలిండర్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా నిఘా పెట్టాలి’ అని కలెక్టర్ల సమావేశంలో ఆదేశించారు. గ్యాస్, ఉద్యాన ఉత్పత్తుల మార్కెట్ పరిస్థితుల అంచనాకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు.