News June 2, 2024
రాబోయే ప్రభుత్వంతో ఏపీ పరిస్థితి మారాలి: ఉండవల్లి

AP: రాబోయే ప్రభుత్వంతో అయినా ఏపీలో పరిస్థితి మారాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆకాంక్షించారు. తెలంగాణలో అవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారని, ఏపీ పరిస్థితి దశాబ్ద ఘోషగా మారిందని అన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉమ్మడి సమస్యలు పరిష్కరించాల్సి ఉందని రాజమండ్రిలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. గత పదేళ్లుగా చంద్రబాబు, జగన్ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేదని ఆరోపించారు.
Similar News
News April 8, 2026
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘గంగోత్రి’ నుంచి ‘పుష్ప-2’ వరకు వైవిధ్యమైన సినిమాలతో మెప్పించారు. ‘వరుడు’, ‘వేదం’ చిత్రాల్లో బెస్ట్ సాంగ్స్, బలమైన కథాంశం ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ‘ఆర్య’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలు క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి. ప్రతి సినిమాలోనూ తనదైన మేనరిజం, డాన్స్‌తో ప్రేక్షకులను అలరించడం ఆయన ప్రత్యేకత. ఆయన నటించిన సినిమాల్లో మీ ఫేవరెట్ ఏంటో కామెంట్ చేయండి.
News April 8, 2026
యుద్ధం ఆపమని ఇరాన్ వేడుకుంది: అమెరికా రక్షణ మంత్రి

సీజ్‌ఫైర్ కోసం ఇరాన్ తమను వేడుకుందని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. ఇరాన్ మిస్సైళ్ల వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని.. ఆ దేశంలోని డిఫెన్స్ ఫ్యాక్టరీలు నాశనం అయ్యాయని చెప్పుకొచ్చారు. ఆ దేశ సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడి ఉన్నారని తెలిపారు. కాగా ఇరాన్ పరిస్థితి గురించి ట్రంప్‌కు హెగ్సెత్ తప్పుడు సమాచారం ఇవ్వడంతోనే యుద్ధం ఇంతకాలం సాగిందంటూ అంతకుముందు రిపోర్ట్స్ వచ్చాయి.
News April 8, 2026
‘రాకా’ టైటిల్ వెనకున్న కథ ఇదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-అట్లీ చిత్రానికి ఫిక్స్ చేసిన ‘రాకా’ టైటిల్ ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం దీని అర్థం ఏంటనే చర్చ జరుగుతోంది. సంస్కృతంలో ‘రాకా’ అంటే పౌర్ణమి అని అర్థం. పున్నమి వేళ మనుషులు తోడేళ్లలా, క్రూరమృగాల్లా మారతారనే పురాణ గాథల నేపథ్యంలో ఇందులో బన్నీ <<19596783>>నెగటివ్ రోల్<<>> హింసాత్మకంగా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ‘రాక్షసుడు’ అనే అర్థం వచ్చేలా అట్లీ ఈ పవర్‌ఫుల్ టైటిల్‌ను సిద్ధం చేసినట్లు టాక్.


