News January 31, 2025
మహా కుంభమేళాకు ఏపీ ప్రత్యేక బస్సులు

AP: UPలో జరుగుతున్న మహా కుంభమేళా కోసం పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా 2 బస్సుల్ని ఏర్పాటు చేయనుంది. వచ్చే నెల 11న తిరుపతి నుంచి, 12న నెల్లూరు నుంచి ఈ బస్సులు ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఆ వివరాల ప్రకారం.. తిరుపతి బస్సు కడప, కర్నూలు, హైదరాబాద్ మీదుగా వెళ్తుంది. తిరిగి 18న తిరుపతికి చేరుకుంటుంది. ఇక నెల్లూరు బస్సు విజయవాడ, రాజమహేంద్రవరం, వైజాగ్ మీదుగా వెళ్లి 19న నెల్లూరుకు తిరిగిరానుంది.
Similar News
News December 4, 2025
జూనియర్ లెక్చరర్ల పరీక్ష ఫలితాలు విడుదల

AP: జూనియర్ లెక్చరర్ల రాత పరీక్ష ఫలితాలను APPSC విడుదల చేసింది. ఇక్కడ <
News December 4, 2025
డాలర్.. 12 లక్షల రియాల్స్!

ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఓ డాలర్ 12 లక్షల రియాల్స్‌కు సమానమైంది. ఫలితంగా నిత్యవసరాల ధరలు పెరిగాయి. అణ్వస్త్ర కార్యక్రమాల వల్ల ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతున్నాయి. దీంతో కొన్నేళ్లుగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోంది. అటు ఆ దేశంలో పవర్ గ్రిడ్ల వైఫల్యం వల్ల గంటలపాటు విద్యుత్‌కు అంతరాయం ఏర్పడి ప్రజలు అల్లాడుతున్నారు. 2015లో ఓ డాలర్ 32 వేల రియాల్స్‌కు సమానంగా ఉండేది.
News December 4, 2025
‘విటమిన్ K’ రిచ్ ఫుడ్స్ ఇవే!

ఎముకలు, గుండె ఆరోగ్యానికి విటమిన్-K అవసరం. గాయాలైనప్పుడు అధిక రక్తస్రావాన్ని నివారించడానికి రక్తం గడ్డకట్టే ప్రోటీన్ల ఉత్పత్తిలో దీనిది కీలకపాత్ర. మహిళల్లో రుతుచక్రాన్ని నియంత్రించడంలోనూ సాయపడుతుంది. ఈ విటమిన్ ఉండే ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, కివీ, పుదీనా, క్యారెట్, అవకాడో, ద్రాక్ష, దానిమ్మ, గుమ్మడికాయ తదితరాల్లో ‘K’ విటమిన్ మెండుగా ఉంటుంది.


