News May 31, 2024

ఏపీ, తెలంగాణ.. నిప్పుల కొలిమి

image

తెలుగు రాష్ట్రాల్లో భానుడు భగభగ మండిపోతున్నాడు. ఉదయం నుంచి ఎండ దంచికొడుతోంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు వినియోగిస్తున్నా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. అత్యవసరమైతే తప్ప సాయంత్రం 5 గంటల వరకు ఎవరూ బయటికి వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. శరీరం డీహైడ్రేట్ కాకుండా తరచూ నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నారు.

Similar News

News October 13, 2024

కన్నడ బిగ్‌బాస్‌కు పోలీసుల షాక్!

image

కన్నడ బిగ్‌బాస్‌లో స్వర్గం-నరకం అనే కాన్సెప్ట్ ఉంది. దాని ప్రకారం నరకంలో ఉన్న కంటెస్టెంట్లకు ఆహారంగా గంజి మాత్రమే ఇచ్చేవారు. బాత్రూమ్‌కి వెళ్లాలన్నా ‘స్వర్గం’ కంటెస్టెంట్ల అనుమతి తీసుకోవాలి. దీంతో షోలోని మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందంటూ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నాగలక్ష్మి పోలీసులకు లేఖ రాశారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు, బిగ్‌బాస్ హౌస్‌కి వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు.

News October 13, 2024

నితీశ్ కుమార్ విజయం వెనుక తండ్రి త్యాగం

image

తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ నేడు భారత క్రికెటరయ్యారు. అతడి తండ్రి ముత్యాల రెడ్డి త్యాగమే తన ఎదుగుదలకు పెట్టుబడైంది. ‘నేను జాబ్ చేసే సంస్థ రాజస్థాన్‌కు మారింది. దాంతో నితీశ్ క్రికెట్‌కి ఇబ్బంది అని ఆ జాబ్ మానేశాను. ఆర్థికంగా బాగా కష్టపడ్డాం. అందరూ ఎన్నో మాటలు అన్నారు. నితీశ్ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం చేస్తే చాలనుకున్నాను. కానీ ఏకంగా భారత్‌కు ఆడుతున్నాడు’ అని ఓ ఇంటర్వ్యూలో మురిసిపోయారు ఆ తండ్రి.

News October 13, 2024

కాంగ్రెస్ నేతల్ని రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరు?: KTR

image

తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఈడీ కేసుల నుంచి రక్షిస్తున్న బిగ్ బ్రదర్ ఎవరని KTR ప్రశ్నించారు. ‘ఇటీవల ఓ మంత్రిపై ఈడీ దాడులు జరిగాయి. రూ.100 కోట్లు దొరికినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఇంతవరకు కాంగ్రెస్, బీజేపీ, ఈడీ నుంచి ఒక్క మాట కూడా రాలేదు. వాల్మీకి స్కామ్‌లోని రూ.40 కోట్లను తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లో వాడిందని కర్ణాటకలో ఈడీ పేర్కొంది. ఇప్పటివరకు అరెస్టులు లేవు’ అని చురకలంటించారు.