News October 29, 2024
ఏపీ టెట్ ఫైనల్ ‘కీ’ విడుదల

AP: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫైనల్ కీ విడుదలైంది. cse.ap.gov.in వెబ్సైట్లో కీని పాఠశాల విద్యాశాఖ అందుబాటులో ఉంచింది. కాగా అక్టోబర్ 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. నవంబర్ 2న ఫలితాలు విడుదల కానున్నాయి.
Similar News
News December 20, 2025
394 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL) 394 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి B.Tech, BE, డిప్లొమా, ITI ఉత్తీర్ణులు అర్హులు. వయసు 18 – 26 ఏళ్ల మధ్య ఉండాలి. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.iocl.com *మరిన్ని ఉద్యోగాలకు <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 20, 2025
ఇండియా దెబ్బ.. పాకిస్థాన్ దొంగ ఏడుపు

పహల్గాం ఉగ్రదాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ ప్రభావం ఇప్పుడు పాక్లో కనిపిస్తోంది. నీటి కొరత తీవ్రంగా ఉండటంతో పాక్ డిప్యూటీ PM ఇషాక్ దార్ మొసలి కన్నీళ్లు కార్చారు. భారత్ ఉద్దేశపూర్వకంగా సింధు జలాల ఒప్పందాన్ని బలహీనపరుస్తోందని, తమ దేశ ప్రజలు దాహంతో చనిపోయే ప్రమాదం ఉందన్నారు. అయితే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోన్న దేశానికి ఇదే సరైన సమాధానమని పలువురు అంటున్నారు.
News December 20, 2025
124 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (<


