News December 18, 2025

AP, TG బార్ కౌన్సిళ్లలో మహిళలకు రిజర్వేషన్

image

మహిళలకు 30% రిజర్వేషన్ అమలు చేయాలని ఏపీ, తెలంగాణ బార్ కౌన్సిళ్లను SC ఆదేశించింది. ఈమేరకు నోటిఫికేషన్ జారీచేయాలని పేర్కొంది. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ న్యాయవాది సుభాషిణి వేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలిచ్చింది. కాగా ఈనెల 20న బార్ కౌన్సిల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. జనవరి 30న ఎలక్షన్ జరగనుంది. ఫిబ్రవరి 10న కౌంటింగ్, ఫలితాల వెల్లడి ఉంటుంది.

Similar News

News February 17, 2026

300కు 300 మార్కులు

image

JEE <<19159273>>మెయిన్‌లో<<>> AP జమ్మలమడుగుకు చెందిన పసల మోహిత్ 100 పర్సంటైల్‌తో 300కు 300 మార్కులు సాధించారు. రోజుకు 4 గంటలే చదివానని, ర్యాంకుల కోసం ఒత్తిడి లేకపోవడంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. విజయవాడలో ఇంటర్ చదివిన అతడు IIT బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. మోహిత్ తండ్రి కిరణ్ కుమార్ ప్రొద్దుటూరులో వైద్యుడిగా పనిచేస్తుండగా, తల్లి సబిత జమ్మలమడుగులోని ప్రభుత్వ ఆసుపత్రిలో డెంటిస్ట్.

News February 17, 2026

ఇండియాకు మాక్రాన్.. రఫేల్ డీల్‌పై ఫోకస్!

image

ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ భారత్ చేరుకున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు ముంబైలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ‘హొరైజాన్ 2047 రోడ్‌మ్యాప్’లో భాగంగా డిఫెన్స్, స్పేస్, అణుశక్తి ఇలా వివిధ అంశాల్లో ఇరు దేశాల సహకారంపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా 114 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుపైనా భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. ఢిల్లీలో జరిగే AI సమ్మిట్‌లోనూ మెక్రాన్ పాల్గొననున్నారు.

News February 17, 2026

కర్తరీ దోషం అంటే ఏమిటి?

image

సూర్యుడు కృత్తికా నక్షత్రంలో సంచరించే కాలాన్ని ‘కర్తరీ దోషం’ అంటారు. దీన్నే ‘అగ్ని నక్షత్రం’ అని కూడా పిలుస్తారు. సాధారణంగా ఇది ప్రతి ఏటా మే నెలలో వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నేరుగా పడతాయి. దీనివల్ల ఎండలు విపరీతంగా పెరుగుతాయి. ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఈ కాలాన్ని ప్రకృతి పరంగా కష్టకాలంగా భావిస్తారు. అందుకే ఈ 15-20 రోజుల పాటు ఎలాంటి కొత్త పనులు ప్రారంభించరు.