News March 18, 2025

ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసుల్లో AP టాప్: ADR

image

దేశవ్యాప్తంగా 4,092 మంది MLAలలో 1,861 మంది(45%)పై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ADR నివేదిక వెల్లడించింది. వారిలో 1,205 మందిపై తీవ్రమైన కేసులు(మర్డర్, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై నేరాలు) ఉన్నట్లు తెలిపింది. ‘79% మంది(138/174) MLAలపై కేసులతో AP టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత కేరళ, TG(69%), బిహార్(66%), మహారాష్ట్ర(65%), TN(59%) ఉన్నాయి. తీవ్రమైన కేసుల్లోనూ AP అగ్రస్థానంలో ఉంది’ అని పేర్కొంది.

Similar News

News March 18, 2025

క్వశ్చన్ పేపర్ల గల్లంతు.. ఇద్దరి సస్పెన్షన్

image

AP: రాయదుర్గం (అనంతపురం) ఓపెన్ స్కూల్లో నిన్న టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాలు గల్లంతయ్యాయి. సెంటర్లో హిందీ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్లు కన్పించకపోవడంతో సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసి ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశారు. ఇక ఆ సెంటర్లో ఒక్క విద్యార్థే హిందీ సబ్జెక్టు రాసేందుకు రాగా సమీపంలోని మరో సెంటర్‌కు వెళ్లి క్వశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఆలస్యంగా అతడిచే పరీక్ష రాయించారు.

News March 18, 2025

మోదీతో ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ భేటీ

image

ప్రధాని మోదీతో మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనతో సమావేశం ఎప్పటికీ మర్చిపోలేనిదని మ్యూజిక్ మ్యాస్ట్రో ట్వీట్ చేశారు. ఇటీవల లండన్‌లో తాను నిర్వహించిన ‘సింఫొనీ వాలియంట్’ ఈవెంట్‌ సహా పలు అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. PM ప్రశంసలు, సపోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. కాగా లండన్‌లో వెస్ట్రన్ క్లాసికల్ సింఫొనీ నిర్వహించిన తొలి ఆసియా సంగీత దర్శకుడిగా ఆయన రికార్డు సృష్టించారు.

News March 18, 2025

ఆడబిడ్డకు జన్మనిచ్చిన సీమా హైదర్

image

పబ్జీ గేమ్ ద్వారా భారతీయ యువకుడితో ప్రేమలో పడి పాకిస్థాన్ నుంచి పారిపోయి వచ్చిన సీమా హైదర్ గుర్తుందా? ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే ఆమెకు నలుగురు పిల్లలుండగా ఇండియాకు వచ్చాక సచిన్‌ను మరోసారి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ గ్రేటర్ నోయిడాలో నివాసముంటున్నారు. కాగా, ఇవాళ ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చిందని, ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు సీమా హైదర్ న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు.

error: Content is protected !!