News October 10, 2025

AP అప్‌డేట్స్ @10AM

image

*రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన ఎన్టీఆర్ వైద్యసేవలు. ఎమర్జెన్సీ సహా అన్నిరకాల వైద్యసేవలను నెట్‌వర్క్ ఆస్పత్రులు నిలిపివేశాయి. రూ.650 కోట్ల బకాయిలు విడుదల చేసే వరకు చర్చలకు వెళ్లకూడదని నిర్ణయించాయి.
*మంత్రివర్గ సమావేశం ప్రారంభం. 30 అంశాలపై చర్చ. రూ.1,14,821 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.
*ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పొగాకు పరిశ్రమలో అగ్నిప్రమాదం. రూ.500 కోట్ల నష్టమని అంచనా.

Similar News

News October 10, 2025

3,500 పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

image

కెనరా బ్యాంకులో 3,500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి OCT 12 చివరితేదీ. APలో 242, TGలో 132 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ పాసైన 20-28ఏళ్ల వయస్కులు అర్హులు. ఎంపికైన అప్రెంటిస్‌లకు నెలకు రూ.15వేలు చెల్లిస్తారు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో ఎన్‌రోల్ చేసుకోవాలి. వెబ్‌సైట్: www.canarabank.bank.in
* ప్రతి రోజూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ కేటగిరీ<<>>కి వెళ్లండి.

News October 10, 2025

లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి ముద్రలు వద్దు: నెటిజన్లు

image

దైవ దర్శనాలకు వెళ్లి తిరిగివచ్చిన భక్తులను ఓ సమస్య వెంటాడుతోంది. ప్రముఖ దేవాలయాల లడ్డూ ప్రసాదాల బాక్సులపై దేవుడి బొమ్మలు, ఆలయ గోపురాలు ముద్రించడమే దీనికి కారణం. లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాక ఖాళీ బాక్సులు, కవర్లను చెత్తలో ఎలా పారేస్తామని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అందుకే దేవాలయం, దేవుడి బొమ్మలకు బదులు ఆలయ పేరు లేదా లోగోను ముద్రించాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News October 10, 2025

213 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 213 పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండి వరకు (OCT 12) అవకాశం ఉంది. సరైన అర్హతలు గల అభ్యర్థులు UPSC వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. వీటిలో అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్, అడిషనల్ లీగల్ అడ్వైజర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, డిప్యూటీ లీగల్ అడ్వైజర్, మెడికల్ ఆఫీసర్, అకౌంట్ ఆఫీసర్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి వివిధ అర్హతలున్నాయి.