News November 26, 2024
గుడ్ల ఉత్పత్తిలో ఏపీ వెరీ గుడ్
AP: FY23లో గుడ్లు, ఆయిల్పామ్ ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. మాంసం ఉత్పత్తిలో నాలుగు, పాల ఉత్పత్తిలో ఐదో స్థానంలో నిలిచినట్లు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన 2023-24 ఆర్థిక సర్వేలో వెల్లడైంది. ఆ కాలంలో 2,78,498 లక్షల గుడ్లు, 10.94 లక్షల టన్నుల మాంసం, 154 లక్షల టన్నుల పాల దిగుబడి సాధించినట్లు తేలింది. 18.95 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడ్ పామ్ ఆయిల్ ఉత్పత్తి అయినట్లు పేర్కొంది.
Similar News
News November 26, 2024
మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసు
AP: వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై యర్రావారిపాలెం పోలీసులు పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మైనర్ బాలికపై అత్యాచారయత్నం జరిగిందంటూ దుష్ప్రచారం చేశారని, తమ పరువుకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
News November 26, 2024
ట్రంప్ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చే ఏడాది జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనుండగా ఆ కార్యక్రమానికి బైడెన్ హాజరవనున్నట్లు వైట్హౌస్ ప్రకటించింది. ఇది రాజ్యాంగ విలువల పట్ల అధ్యక్షుడికి ఉన్న నిబద్ధత అని పేర్కొంది. 2021లో అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికపై విమర్శలు చేసిన ట్రంప్ ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లని విషయం తెలిసిందే. మరోవైపు అధికార మార్పిడికి పూర్తిగా సహకరిస్తానని ఇప్పటికే బైడెన్ ప్రకటించారు.
News November 26, 2024
నిలకడగా శక్తికాంత దాస్ ఆరోగ్యం
చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరిన RBI గవర్నర్ శక్తికాంత దాస్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆరోగ్య పరిస్థితిపై త్వరలో అప్డేట్ ఇస్తామని RBI వర్గాలు తెలిపాయి. కాగా ఛాతీలో నొప్పితో శక్తికాంత దాస్ ఇవాళ ఉదయం ఆసుపత్రిలో చేరారు.