News September 19, 2024
AP: స్కూళ్లకు దసరా సెలవులు ఎప్పుడంటే?

తెలంగాణలో స్కూళ్లకు దసరా <<14141736>>సెలవులు <<>>ప్రకటించడంతో ఏపీలో ఎప్పట్నుంచి ఉంటాయనే చర్చ మొదలైంది. విద్యాశాఖ ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4వ తేదీ నుంచి సెలవులు ప్రారంభమై అక్టోబర్ 13తో ముగుస్తాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతికి సెలవు కాగా.. 3వ తేదీన వర్కింగ్ డేగా ఉండనుంది. ఇటీవల వర్షాలతో పలు జిల్లాల్లో 5-6 రోజుల పాటు స్కూళ్లకు సెలవు ఇవ్వడంతో దసరా హాలిడేస్ తగ్గించే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News October 23, 2025
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో 88 పోస్టులు

ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ 88 అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, ఎంఎస్సీ, B.LSc అర్హతగల అభ్యర్థులు ఈ నెల 26వరకు అప్లై చేసుకోవచ్చు. ముందుగా NATS పోర్టల్లో ఎన్రోల్ చేసుకోవాలి. అనంతరం దరఖాస్తు ఫారం, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలి. వెబ్సైట్: https://dtu.ac.in/
News October 23, 2025
సోదరులు.. ఈ బాధ్యతను మరవొద్దు!

‘భాయ్ దూజ్’ రోజున తమ సోదరి ఆహ్వానాన్ని గౌరవించి సోదరులు ఆమె ఇంటికి సంతోషంగా వెళ్లాలి. ఆమెకు ప్రీతిపాత్రమైన కానుకలు, వస్త్రాలు తీసుకెళ్లాలి. ఇది సోదరి పట్ల ప్రేమ, గౌరవాన్ని తెలియజేస్తుంది. సోదరి పెట్టే తిలకం, హారతిని భక్తితో స్వీకరించాలి. భోజనం చేసిన తర్వాత, ఆమె పాదాలకు నమస్కరించి, వారి దీర్ఘాయుష్షు కోసం ప్రార్థించాలి. ఎప్పుడూ వారికి తోడుగా ఉంటానని, కష్టాల్లో రక్షణగా నిలుస్తానని వాగ్దానం చేయాలి.
News October 23, 2025
అందరికీ ఆదర్శం ఈ కిసాన్ చాచీ

బిహార్లోని ముజఫర్పుర్ జిల్లా సరేయాకు చెందిన 73 ఏళ్ల రాజకుమారి దేవి ఉత్సాహంగా సైకిల్పై ప్రయాణిస్తూ కనిపిస్తారు. గత 20ఏళ్లుగా సైకిల్పై వెళ్లి సమీపగ్రామాల్లోని మహిళలకు ఆధునిక వ్యవసాయం, ఊరగాయలు పెట్టడం నేర్పిస్తున్నారామె. ఆమె సేవలకుగానూ 2007లో కిసాన్ శ్రీ, 2019లో పద్మశ్రీ అవార్డులు వరించాయి. తాము ఆర్థికంగా బలపడేందుకు సాయం చేస్తున్న రాజకుమారిని అక్కడివారు ముద్దుగా కిసాన్ చాచీ అని పిలుచుకుంటారు.